ప్రధాని మోడీకి హీరో విశాల్ థాంక్స్: ఎందుకంటే?
చెన్నై: తన ఫిర్యాదుపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి సినీ నటుడు విశాల్ (Vishal) కృతజ్ఞతలు తెలిపారు. సెన్సార్ బోర్డ్ ముంబై కార్యాలయంలో జరిగిన అవినీతి విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించడంపై విశాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోడీతోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ముంబై కార్యాలయంలో అవినీతికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకున్నందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు తీసుకునే చర్యలు.. అవినీతికి పాల్పడాలనుకునే ప్రభుత్వ అధికారుల్లో భయాన్ని నింపుతాయని ఆశిస్తున్నా. అలాగే, లంచాలు తీసుకోకుండా నిజాయితీగా వారు దేశానికి సేవలు చేసేందుకు ఈ చర్యలు దోహదపడతాయని నమ్ముతున్నా' అని విశాల్ పేర్కొన్నారు.

అంతేగాక, 'ఈ విషయంపై త్వరితగతిన స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతోపాటు ఇతర అధికారులకు నా కృతజ్ఞతలు. మీరు స్పందించిన తీరు సంతృప్తి ఇచ్చింది. నాలాగా అవినీతి వల్ల ఇబ్బంది పడిన సామాన్యులకు న్యాయం అందుతుందని నమ్ముతున్నా' అని ట్విట్టర్ వేదికగా విశాల్ వ్యాఖ్యానించారు.
కాగా, తాను నటించిన మార్క్ ఆంటోనీ (Mark Antony) సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో తాను లంచం ఇవ్వాల్సి వచ్చిందని విశాల్ గురువారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా సెన్సార్ కోసం దాదాపు రూ. 6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన తెలిపారు.
తాను ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, మరో దారిలేక డబ్బులివ్వాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తుల్లో ఏ నిర్మాతకూ ఇలా జరగకూడదని విశాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేశారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications