వివాహబంధంలోకి అడుగుపెట్టిన మహేశ్ బాబు చెల్లెలు.. ఫొటోలు వైరల్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డమరుకం, దమ్ము చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి అభినయ. ఇతర పరిశ్రమల్లోనూ హీరోయిన్‌గా గుర్తింపు పొందుతున్న అభినయ తాజాగా పెళ్లి చేసుకుంది. మహేశ్‌ బాబుకు చెల్లిగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు అక్కగా అభినయ నటించిన విషయం తెలిసిందే.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డమరుకం, దమ్ము చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ. ఆమె తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన చిన్ననాటి స్నేహితుడు కార్తిక్ తో ఏడడుగులు వేశారు. పదిహేనేళ్ల నుంచి అభినయ, కార్తిక్ ప్రేమించుకుంటున్నారట. ఈ క్రమంలోనే వాళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.

Actress Abhinaya Ties the Knot in a Private Ceremony

మార్చి 9వ తేదీన నిశ్చితార్థం చేసుకోగా.. బుధవారం (ఏప్రిల్‌ 16) అంగరంగ వైభవంగా ఆమె పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి సినీ రంగ ప్రముఖులతోపాటు సీనీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు.. ఇతర రంగాల ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అయితే అభినయ పుట్టుకతోనే చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతోంది.

Actress Abhinaya Ties the Knot in a Private Ceremony

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేశ్‌ బాబు, వెంకటేశ్ లకు చెల్లిగా.. దమ్ము సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కు అక్కగా అభినయ నటించి మెప్పించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అభినయ మెరిసింది. అయితే తాజాగా ఆమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహేశ్,ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+