అనుష్క సంచలన నిర్ణయం.. ఇక గుడ్ బై!
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్ అనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి. తనదైన శైలితో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. కన్నడలో జన్మించిన ఈ భామ.. 2005లో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
ఆ తరువాత విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, కింగ్, బిల్లా, ఖలేజా, రగడ, ఢమరుకం, మిర్చి, సైజ్ జీరో, ఊపిరి, భాగమతి వంటి హిట్స్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది. ముఖ్యంగా అరుంధతితో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారగా.. బాహుబలి సిరీస్‌తో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది.

నాలుగేళ్ల తర్వాత ఘాటితో రీ-ఎంట్రీ..
కాగా సుదీర్ఘ విరామం తర్వాత అనుష్క క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఘాటి అనే యాక్షన్ డ్రామాతో తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె శక్తివంతమైన శీలావతి పాత్రలో నటించగా, విక్రమ్ ప్రభు హీరోగా, జగపతి బాబు, చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటించారు. క్రిష్‌తో ఆమె వేదం తర్వాత కలిసి పనిచేయడం వల్ల ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సెప్టెంబర్ 5న విడుదలైన ఘాటి మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
మొదటిరోజు కలెక్షన్స్ కొంతవరకు బాగానే ఉన్నా, రెండో రోజు నుంచే క్షీణించడం ప్రారంభమైంది. వారం రోజులు తిరిగేసరికి థియేటర్లలో పూర్తిగా ఫ్లాప్ అయ్యి, బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా మారడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ క్రమంలోనే మూవీ విడుదలైన కొన్ని రోజులకే అనుష్క తన అభిమానులకు ఆశ్చర్యం కలిగించే నిర్ణయం వెల్లడించారు.
సోషల్ మీడియాకు తాత్కాలికంగా దూరమవుతున్నట్లు నోట్‌ను పోస్ట్ చేశారు. అందులో.. బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్‌కి మారుతున్నా. స్క్రోలింగ్‌కు అతీతంగా ఉన్న ప్రపంచంతో మళ్లీ కనెక్ట్ అవ్వాలి. అందుకే సోషల్ మీడియా నుంచి కొంతకాలం దూరమవుతున్నా. త్వరలో మరిన్ని కథలతో, మరింత ప్రేమతో మళ్లీ కలుస్తా" అని పేర్కొన్నారు. 'ఘాటి' చిత్రం డిజాస్టర్ అయిందన్న బాధలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications