స్టార్ హీరో కూతుర్ని గర్భవతిని చేసిన క్రికెటర్
అతియా శెట్టి..సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ స్టార్ కిడ్‌గా పరిచయమైన అతియా శెట్టి, తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. సునీల్ శెట్టి కూతురుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె, తన నటనతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. 2015లో 'హీరో' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అతియా శెట్టి తెలుగులో కూడా నటించింది. 'మొబైల్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించరామె. ఇక ఇదే సమయంలో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్‌తో ప్రేమయాణం సాగించింది.
అతియా శెట్టి ,ఎల్ రాహుల్ చాలా కాలం ప్రేమలో ఉన్నారు. దీంతో వీరు తమ రిలేషన్‌ను పెళ్లిగా మార్చుకోవాలని అనుకున్నారు. ఇరు కుటుంబ పెద్దల సైతం అతియా శెట్టి ,కేఎల్ రాహుల్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వీరి వివాహం 2023 జనవరి 23న జరిగింది. ఈ వివాహం ఖండాలాలోని సునీల్ శెట్టి నివాసంలో అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో జరిగింది.తాజాగా అతియా శెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నా అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ''2025 లో మా ప్రార్థనలకు అందమైన ప్రతిరూపం రానుంది'' అని రాసుకొచ్చారు.

అంతేకాకుండా చిన్ని పాదాలు షేర్ చేయడంతో పాటు దిష్టి చుక్కను కూడా పెట్టింది. దీంతో అతియా ప్రెగ్నెంట్ అయినట్లు అర్థమవుతోంది.మొదట్లో స్నేహితులుగా ఉన్న కేఎల్ రాహుల్, అతియా శెట్టి తమ పరిచియం ప్రేమగా మార్చుకున్నారు. కేఎల్ రాహుల్, అతియా శెట్టి గురించి అనేక రుమార్స్ తెర మీదకు వచ్చినప్పటికీ ..వాటిపై ఎప్పుడు ఈ జంట స్పందించింది లేదు. 2021లో కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తాను గర్భవతి అయ్యానంటూ అతియా శెట్టి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications