సినిమాలకు స్టార్ హీరోయిన్ గుడ్‪బై.. సీరియల్స్‌లోకి ఎంట్రీ!

సినీ ఇండస్ట్రీలో విజయాలు, అవకాశాలు ఎంత వేగంగా వస్తాయో.. అంతే వేగంగా మాయమవుతుంటాయి. ఒకానొక దశలో స్టార్ డమ్ అనుభవించిన వారు ఊహించని విధంగా అధఃపాతాళానికి పడిపోతారు. ఒకట్రెండు ఫ్లాప్‌లు పడితే మాత్రం పూలు పడిన చోటే రాళ్లు పడుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వరుస హిట్లు ఇచ్చి.. ఒక ఫ్లాప్ వస్తే చాలు ఆమెను దూరం పెట్టి కొత్త వాళ్లను పరిచయం చేస్తూ ఉంటారు. అందుకే చాలా మంది హీరోయిన్లు తమకు క్రేజ్ ఉన్నప్పుడే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు చెబుతుంటారు. మరికొందరు పెళ్లి తర్వాత కుటుంబ పరిస్థితుల వల్ల లేదా అవకాశాలు తగ్గిపోవడం వల్ల వెండితెరకు దూరమవుతారు.

వెండితెరకు దూరమై బుల్లితెర వైపు..
తాజాగా ఇదే తరహాలో ప్రముఖ నటి అవికా గోర్ కూడా సినిమాలకు గుడ్‌ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించి.. అనంతరం హీరోయిన్ గా మెప్పించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం మళ్లీ సీరియల్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత వెండితెరపై ఆశించిన స్థాయిలో ఛాన్సులు రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే యాక్టింగ్ కు పూర్తిగా స్వస్తి చెప్పకుండా.. తనను నటిగా నిలబెట్టిన బుల్లితెరపైనే రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

Actress Avika Gor Quits Movies for TV Serials From Uyyala Jampala to TV Comeback Details here

చిన్నారి పెళ్లికూతురు నుంచి ఉయ్యాల జంపాల వరకు..
అవికా గోర్ 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో దేశవ్యాప్తంగా మంచి ప్రజాదరణను సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సీరియళ్లలో కూడా సత్తా చాటింది. అనంతరంలో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో కథానాయికగా ప్రస్థాన్ ప్రారంభించిన అవికా గోర్.. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావా, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3, నెట్, బ్రో, టెన్త్ క్లాస్ డైరీస్, థ్యాంక్యూ, పాప్‌కార్నర్, ఉమాపతి, షణ్ముఖ, అగ్లీ స్టోరీ వంటి వంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, కజక్ భాషల్లో కూడా నటించింది.

నటుడు, వ్యాపారవేత్త మిళింద్ చద్వానీతో ప్రేమలో పడిన అవికా గోర్.. కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ జంట 2025 సెప్టెంబర్ 30న హిందీ రియాలిటీ షోల వివాహం చేసుకుని షాకిచ్చింది. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితులు లేకుండా టీవీ రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవడంపై అవికా గోర్ పై ట్రోలింగ్ జరిగింది. దీనికి తనదైన స్టైల్లో అవికా గోర్ కౌంటర్ ఇచ్చింది. ఇటీవల భర్తతో కలిసి ఆమె ఇండియాను వదిలి బ్యాంకాక్ లో స్థిరపడుతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. అయితే ఆమె తిరిగి బుల్లితెరపై రీ-ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వినిపించాయి. ఆ వార్తలకుబలం చేకూరుస్తూ అవికా గోర్ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడికి చేరుకోవడం ఆనందంగా ఉందని ఆమె పోస్ట్ చేసిది. కొత్త మార్గాల్లో జర్నీని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుంటామని.. కానీ లైఫ్ అప్పుడప్పుడూ మూలల వైపుకు తీసుకెళ్తుందని.. అలాగని ఇది వెనకడుగు వేసినట్లు కాదని.. కొత్తగా దానిని అర్ధం చేసుకునేలా ఎదిగామని అవికా గోర్ రాసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+