"నాతో పడుకోమని అడిగింది నువ్వే కదా?": నిర్మాతను నిలదీసిన స్టార్ హీరోయిన్!
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటి చాందిన చౌదరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టడంతో ఈ వివాదం మళ్లి రాజుకుంది. 'చాయ్ బిస్కెట్' నిర్వహించిన 'ది ఆడిషన్ షో'లో పాల్గొన్న చాందిని చౌదరితన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఒక కలవరపరిచే సంఘటనను గుర్తుచేసుకున్నారు. తనకు ఓ అవకాశానికి బదులుగా లైంగిక కోరికలు తీర్చాలని ఓ నిర్మాత వేధించినట్లు ఆమె ఆరోపించారు.
ఆఫర్ పేరుతో వేధింపులు
చాందిని చౌదరి వెల్లడించిన వివరాల ప్రకారం.. 2015లో 'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అవకాశం ఇస్తానని ఓ నిర్మాత ఆమెను సంప్రదించారు. మొదట ఆమె తల్లి సమక్షంలోనే మాట్లాడిన ఆ నిర్మాత.. ఆ తర్వాత చాందిని చౌదరికి ఏకాంతంగా ఫోన్ చేసి ఆమె రూపం, రంగు గురించి కామెంట్స్ చేస్తూ పరోక్షంగా కమిట్మెంట్ అడిగాడు. ఆమె దానికి నిరాకరించడంతో ఆ నిర్మాత ఆమె తల్లికి కూడా ఫోన్ చేసి అనుచితంగా ప్రవర్తించాడని.. దాంతో ఆందోళన చెందిన తల్లి మళ్లీ ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తీవ్రంగా హెచ్చరించినట్లు చాందిని చౌదరి చెప్పుకొచ్చారు.

నిర్మాతను ముఖం మీదే నిలదీసిన చాందిని
2024లో 'గామి', 'ఏవం', 'మ్యూజిక్ షాప్ మూర్తి' చిత్రాల ప్రమోషన్ల సమయంలో అదే నిర్మాతను కలిసిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేసుకుంది. చాందిని చౌదరి చెప్పిన దాని ప్రకారం.. ఆ సమయంలో ఆమె అతడిని నేరుగా నిలదీస్తూ, "అప్పుడు నాతో పడుకోమని అడిగింది నువ్వే కదా?" అని ప్రశ్నించినట్లు చెప్పారు. దాంతో ఆ నిర్మాతకు మాటలు రాలేదని ఆమె వెల్లడించారు.
వ్యక్తిత్వ హననం, కెరీర్‌పై ప్రభావం
తన కోరికను తీర్చకపోవడంతో సదరు నిర్మాత తర్వాత కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడని చాందిని చౌదరి ఆరోపించారు. ఇండస్ట్రీలో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ.. తనను అహంకారిగా, కలిసి పనిచేయడానికి కష్టమైన వ్యక్తిగా ముద్ర వేశారని చాందిని చౌదరి ఆరోపించారు. ఆ ఇమేజ్ నేటికీ తన కెరీర్‌పై ప్రభావం చూపుతూనే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది ఓ అనధికారిక అవసరంగా మిగిలిపోయిందని ఆరోపించిన మరుసటి రోజే చాందిన చౌదరి ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. ప్రస్తుతం టాలీవుడ్ రూ.500 కోట్ల నుంచి రూ.1000 కోట్ల కలెక్షన్లతో పాన్-ఇండియా రేంజ్ లో ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చుకుంటోంది. కానీ వర్ధమాన నటీమణులు, ముఖ్యంగా మహిళలు దోపిడీ కాకుండా ప్రతిభే విజయానికి మార్గమని నమ్మేలా చూడాల్సిన బాధ్యత కూడా ఈ పరిశ్రమకు ఉంది. చాందినీ చౌదరి వంటి కథలు వెలుగులోకి రావడం ఆగేంత వరకు ఓ ఇబ్బందికరమైన ప్రశ్న పరిశ్రమను వెంటాడుతూనే ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ నిజంగానే కనుమరుగవుతోందా, లేక కేవలం దాని రూపు మారుతోందా?




Click it and Unblock the Notifications