పక్కా ప్లాన్‌తో పోలీస్ ఆఫీసర్‌తో బిడ్డను కనేసిన తెలుగు హీరోయిన్
ఓ హీరోయిన్ ఏకంగా పోలీస్ ఆఫీసర్‌తో ప్రేమయాణం సాగించడమే కాకుండా అతన్ని పెళ్లి చేసుకుంది. విచిత్ర ఏమిటంటే సరిగ్గా పెళ్లి రోజునే బాబుకు జన్మనిచ్చి అందరికి షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..హీరోయిన్ చిత్రా శుక్ల పలు తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది. "చల్ భాగ్" అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వైభవ్ ఉపాధ్యాయ.. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. మా అబ్బాయి , రంగులరాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి ..మొదలగు సినిమాల్లో చిత్రా శుక్ల హీరోయిన్‌గా నటించింది.
కానీ వీటిల్లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చిత్రా శుక్లకు హిట్ ఇవ్వలేకపోయింది. దీంతో ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే చిత్రా శుక్ల.. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఓ వ్యక్తితో క్లోజ్‌గా దిగిన ఫొటోలను చిత్రా శుక్ల తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వ్యక్తి ఎవరా అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.

మొదట్లో అతను చిత్రా శుక్ల క్లోజ్ ఫ్రెండ్ అని అనుకున్నారంతా. తర్వాత కాని అసలు విషయం బయటపడలేదు. వైభవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో తాను గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నానని.. అతన్నే పెళ్లి చేసుకుంటున్నట్టు చిత్రా శుక్ల ప్రకటించింది. చెప్పిన విధంగానే ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది. చిత్రా శుక్ల భర్త వైభవ్ ఉపాధ్యాయ్ మధ్యప్రదేశ్‌లో పోలీస్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఈ జంటకు బాబు పుట్టారు.
ఈ విషయాన్ని చిత్రా శుక్ల తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సెప్టెంబర్ 30న రాత్రి 9:31 నిమిషాలకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ''మా వివాహ ముహూర్తం ఉదయం 9.31 గంటలకు.. మా బాబు కూడా అదే ముహూర్తానికి రాత్రి 9.31 గంటలకు పుట్టాడు. మా కుటుంబం మొత్తం ఉప్పొంగిపోయి, ఆనందంగా ఉంది. నాకు కలలో జీవిస్తున్నట్లు అనిపిస్తుందంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చిత్రా శుక్ల రాసుకొచ్చింది. దీంతో ఆమె అభినందనలు తెలుపుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications