వాళ్ల విడాకులతో నాకు సంబంధం లేదు.. ఇదే ఫైనల్ వార్నింగ్ !

చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి చాలా కామన్‌ అయిపోయాయి . ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్థల కారణంగా కొన్ని జంటలు విడిపోవడం వారి అభిమానులకు సైతం ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య-సమంత, ధనుష్‌-ఐశ్వర్య రజనీకాంత్‌, ఆస్కార్‌ ఆవార్డు గ్రహిత ఏఆర్‌ రెహమాన్‌ దంపతులు ఇలా జంటలు విడాకులు తీసుకున్నారు.

ఇక వారి బాటలోనే ప్రముఖ సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాశ్ కూడా గతేడాది తన భార్య తన భార్య సైంధవికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే రీసెంట్ గానే ఈ వ్యవహారంలో వారిద్దరూ కలిసి ఒకే కారులో కోర్టుకు రావడం చర్చనీయాంశం అయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తమ 12 ఏళ్ల వివాహా బంధాన్ని విడాకులతో ముగించారు. అయితే జీవీ ప్రకాష్, సైంధవి విడాకులు తీసుకోవడానికి ఓ హీరోయిన్ కారణం అంటూ సోషల్ మీడియాలో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.

actress-divya-bharathi-shocking-post-on-social-media-that-this-is-the-final-warning

ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలు రావడం సహజమే. రెండు, మూడు సినిమాల్లో కలిసి నటిస్తే ఇంకా ఎక్కువగా ఆ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అవే ప్రముఖ నటి దివ్య భారతికి తిప్పలు తెచ్చాయి. గతంలో బ్యాచిలర్ ‍అనే తమిళ మూవీలో జీవీ ప్రకాశ్, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీతో పాటు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. రీసెంట్ గా ఈ జంట కింగ్ స్టన్ అనే సినిమాలో కూడా నటించారు. అప్పటికే GV ప్రకాష్ విడాకులు తీసుకోవడంతో ఈ పుకార్లపై దివ్యభారతి అప్పుడే క్లారిటీ ఇచ్చింది. తనకు, GVకి మధ్య ఏమి లేదని, తనను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దని తెలిపింది.

అయితే మలేషియాలో జరిగిన ఒక మ్యూజికల్ ఈవెంట్ లో GV ప్రకాష్, గాయని సైంధవి విడిపోయిన తర్వాత మొదటిసారిగా కలిసి ఒకే వేదికపై కనిపించారు. దీంతో మళ్లీ దివ్య భారతిని ట్రోల్ చేస్తూ కొందరు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆమె ఘాటుగా స్పందించింది. ఇదే ఫైనల్ వార్నింగ్ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ మేరకు అఆ పోస్టులో.. జీవీ ప్రకాశ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కి తనకు సంబంధం లేదని రాసుకొచ్చింది. తానెప్పుడు ఓ నటుడితో డేటింగ్ చేయలేదని.. అందులోనూ పెళ్లి అయిన వ్యక్తితో అసలు డేటింగ్ చేయను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని.. కానీ ఈ పుకార్లకు చెక్ పడటం లేదని అందువల్ల తన పేరు దెబ్బతింటోందని మండిపడింది.

actress-divya-bharathi-shocking-post-on-social-media-that-this-is-the-final-warning

అంతే కాకుండా ఇలాంటి వార్తలు సృష్టించే బదులు ఏదైనా పనికొచ్చే పనిచేసుకోవాలని హితబోధ చేసింది. తన ప్రైవసీని గౌరవించాలని.. ఈ అంశంలో ఇదే తన మొదటి, చివరి ప్రకటన అంటూ తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+