హార్దిక్ పాండ్యతో డేటింగ్ పై ఓపెన్ అయిన హాట్ బ్యూటీ..!
బాలీవుడ్ నటి ఇషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2012లో జన్నత్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. బేబీ, రుస్తుం, కమాండో 2 తదితర హిందీ చిత్రాల్లో నటించింది. అలానే తెలుగులో వీడెవడు, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. ఆశ్రమ్ సీజన్ 3 వెబ్ సిరీస్‌లో సోనియాగా మెప్పించిన ఈ బ్యూటీ.. బాబీ డియోల్‌తో ఇంటిమేట్ సీన్‌లో దుమ్మురేపింది. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. అయితే ఇప్పుడు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతో డేటింగ్ పై ఓపెన్ అయ్యి హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషా గుప్తా.. తన సినిమా విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఓపెన్ అయ్యారు. హార్దిక్ పాండ్యతో కొన్నేళ్ల నుంచి ఆమె డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి . ఈ విషయంలో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సీక్రెట్ రివీల్ చేశారు. అయితే తమ మధ్య కొంతకాలం స్నేహం కొనసాగిందని.. కానీ అది తాము డేటింగ్ దశలోకి అడుగుపెట్టకముందే అంతా ముగిసిపోయిందని పేర్కొన్నారు.

ఇంకా ఆమె ఏం చెప్పారంటే.. కొంతకాలం మేము మాట్లాడుకున్నాం. మేము డేటింగ్ చేస్తున్నామని నేను అనుకోను. అది డేటింగ్ కావచ్చు, కాకపోవచ్చు అనే స్టేజ్ లో ఉండేవాళ్లం. కానీ డేటింగ్ దశకు చేరుకునే ముందే రిలేషన్ షిప్ బ్రేకప్ అయింది. కాబట్టి అది డేటింగ్ కాదు. మేం ఒకట్రెండు సార్లు కలిశాం. మా మధ్య బంధం రెండు నెలల్లోనే ముగిసింది'' అని ఇషా చెప్పారు.
హార్దిక్ పాండ్య పర్సనల్ లైఫ్..
క్రికెటర్ గా ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న హార్దిక్.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. నటీమణి నటాషా స్టాంకోవిచ్తో ప్రేమలో పడ్డ హార్దిక్, 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కానీ కొన్నాళ్ల క్రితం మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే హార్దిక్ సింగిల్‌గానే ఉంటున్నాడు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !!












Click it and Unblock the Notifications