మొదటి పెళ్లి సెట్ కాలేదు..మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉంది

నటి ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు.ఎస్తేర్ అందాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్‌గా ఇచ్చింది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబ్బాదాలు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా నటించింది.మరీ ముఖ్యంగా భీమవరం బుల్లోడులో నటించిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. ఇక తర్వాత గరం, జయ జానికి నాయక, జాలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, నయనం, ఐరావతం,69 సంస్కార్ కాలనీ, చాంగురే బంగారు రాజా, డేవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి వాటిల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.

ఇక ప్రముఖ సింగర్ నోయెల్ సీన్‌ కొన్నాళ్లు ప్రేమయాణం సాగించిన ఈ భామ .. 2019లో అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్ది నెలలకే అభిప్రాయభేదాలు రావడంతో అతనికి విడాకులిచ్చింది. పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తేర్ గ్లామర్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా రెక్కి సినిమాలో ఎస్తేర్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. ఈ సినిమా తర్వాత చాలామంది ఎస్తేర్‌కు అభిమానులుగా మారిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఎస్తేర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్తేర్ రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Actress Ester Noronha about Her Second Marriage

ఆమె మాట్లాడుతూ.. నాకు ఒంటరిగా బతకాలని లేదు. పెళ్లి చేసుకోవాని ఉంది. నాకు పార్టనర్‌ కావాలి, బ్యూటీఫుల్‌ లైఫ్‌ కావాలి. కానీ ఎవరిని చేసుకోవాలి అనేదానిపై పూర్తి క్లారిటీ లేదు. ఇప్పటికే మొదటి పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. షోకేస్ లాంటి మొగడు వద్దు అంటూ చెప్పుకొచ్చింది. ఎస్తేర్ ప్రస్తుతం ఎక్కువగా బోల్డ్ రోల్స్ నటిస్తోంది. ఈ మధ్య టెనెంట్‌లో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా తన నటన, యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టింది. ఎస్తేర్ రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+