పెళ్లైన 15 రోజులకే విడాకులు.. వెంటనే గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్

నటి ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు.ఎస్తేర్ అందాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్‌గా ఇచ్చింది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబ్బాదాలు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా నటించింది.మరీ ముఖ్యంగా భీమవరం బుల్లోడులో నటించిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. ఇక తర్వాత గరం, జయ జానికి నాయక, జాలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, నయనం, ఐరావతం,69 సంస్కార్ కాలనీ, చాంగురే బంగారు రాజా, డేవిల్ వంటి వాటిల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.

ఇక ప్రముఖ సింగర్ నోయెల్ సీన్‌ కొన్నాళ్లు ప్రేమయాణం సాగించిన ఈ భామ .. 2019లో అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్ది నెలలకే అభిప్రాయభేదాలు రావడంతో అతనికి విడాకులిచ్చింది. పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తేర్ గ్లామర్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా రెక్కి సినిమాలో ఎస్తేర్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. ఈ సినిమా తర్వాత చాలామంది ఎస్తేర్‌కు అభిమానులుగా మారిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఎస్తేర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్తేర్ రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Actress Esther Noronha s Second Marriage Rumours Go Viral on Social Media

ఆమె మాట్లాడుతూ.. నాకు ఒంటరిగా బతకాలని లేదు. పెళ్లి చేసుకోవాని ఉంది. నాకు పార్టనర్‌ కావాలి, బ్యూటీఫుల్‌ లైఫ్‌ కావాలి. కానీ ఎవరిని చేసుకోవాలి ఈనేదానిపై పూర్తి క్లారిటీ లేదు. ఇప్పటికే మొదటి పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. షోకేస్ లాంటి మొగుడు వద్దు అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఎస్తేర్ తాజాగా తన సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్రిస్టియన్ పెళ్లికూతురు ధరించే తెల్లని గౌనులో ఉన్న ఫొటోను ఆమె షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమె పడవలో ప్రయాణిస్తూ చేపలతో ఆడుకుంటున్నట్లుగా కనిపించారు. ఈ పోస్ట్‌లో.. మీతో ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌ను పంచుకోబోతున్నాను. త్వరలోనే అది వస్తుంది, వేచి ఉండండి అని రాసుకొచ్చారు.ఇది చూసిన నెటిజన్లు ఎస్తేర్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని భావిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+