మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న "గ్లామర్ బ్యూటీ".. హిట్ కొట్టేనా !
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది ప్రముఖ నటి "హన్సిక". బాలనటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, చిన్న వయస్సులోనే ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ముఖ్యంగా Shaka Laka Boom Boom అనే బాలల ధారావాహిక ద్వారా మంచి గుర్తింపు పొందారు. అనంతరం బాలీవుడ్ చిత్రాల్లో కనిపించిన ఆమె, హీరోయిన్‌గా Aap Kaa Surroor చిత్రంతో పరిచయమై Himesh Reshammiya సరసన నటించారు. తెలుగులో అల్లు అర్జున్ సరసన 'దేశముదురు' (2007) సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టి.. తొలి చిత్రంతోనే ఉత్తమ నటి 'ఫిలింఫేర్ అవార్డు'ను సొంతం చేసుకుంది.
ఆ తర్వాత ఎన్టీఆర్‌తో 'కంత్రి', రామ్‌తో 'మస్కా'.. 'సీతారాముల కళ్యాణం', 'సమ్‌థింగ్ సమ్‌థింగ్', ఓ మై ఫ్రెండ్.. వంటి వరుస క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్‌లోనూ స్టార్ హీరోల సరసన నటించి జూనియర్ ఖుష్బూగా పేరు సంపాదించుకుంది. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే హన్సిక డిసెంబర్ 2022లో ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్ ఖతురియాను అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది.

అయితే పెళ్లయిన కొద్దిరోజులకే తీవ్ర అభిప్రాయ భేదాల వల్ల జూలై 2024 నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. మనస్పర్థలు తొలగకపోకపోవడంతో, పరస్పర అంగీకారంతో విడిపోవడమే మంచిదని చివరకు భావించారు. ఈ క్రమంలోనే ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు 2026, మార్చి 11న వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ సినిమా ప్రపంచంలోకి సరికొత్త పంథాలో అడుగుపెడుతోంది.
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గల్లీ' అనే భారీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ద్వారా ఆమె పవర్‌ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతోంది. ఈ హై-వోల్టేజ్ సిరీస్‌లో హన్సికతో పాటు జేడీ చక్రవర్తి, సుధీర్ బాబు, ప్రిన్స్, శ్రీనిధి శెట్టి వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించిన ఒక ఇంటెన్స్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ప్రాంతాల్లో జరిగింది. దీంతో ఈ రీఎంట్రీ టాలీవుడ్‌లో మళ్లీ బిజీ హీరోయిన్‌గా మారడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications