కొడుకు ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినా నటి ఇలియానా..
కొడుకు ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినా నటి ఇలియానా :టాలీవుడ్ నటి ఇలియానా డిక్రూజ్ గత నెల ఆగస్ట్‌లో కొడుకుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమె మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకుంది. ఇలియానా డి క్రూజ్ ఇటీవల వ్యక్తిగత కారణాలతో వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది మేలో, ఆమె మైఖేల్ డోలన్‌ను పెళ్లిచేసుకుంది. ఈ జంట ఆగస్టులో వారి మొదటి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు తాజాగా డిక్రూజ్ తన కొడుకు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఇలియానా డి క్రూజ్ కొడుకు ఫొటోలు : ఈ ఏడాది ఆగష్టు 1 న, ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి కోవా ఫీనిక్స్ డోలన్ అనే పేరును పెట్టారు. సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి, ఇలియానా డి'క్రూజ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో నెల వయసున్న కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ అందమైన రూపాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. ఈ ఆనందం మాటల్లో వర్ణించలేనిది అంటూ ఇలియానా రాసుకొచ్చారు. ఈ ఫోటోలో సాక్స్‌తో కప్పబడిన ఆమె కొడుకు చిన్న కాళ్లు కనిపిస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్‌లో ఎత్తుకున్న ఫొటోతో కన్నీళ్ల ఎమోజిని కూడా షేర్ చేశారు ఇలియానా.

బాలీవుడ్‌లోనూ పేరు సంపాదించుకుంది : ఇలియానా టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. బర్ఫీ సినిమాలో రణబీర్ కపూర్‌తో అద్భుతమైన నటన కనబరిచారు. ఇలియానా ఆండ్రూ నీబోన్ అనే ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గతంలో అనేక మీడియా సంస్థలు నివేదించాయి. అయితే 2019 ఆగస్టులో వీరిద్దరూ విడిపోయినట్లు కూడా బీ టౌన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ తర్వాత ఆమె 2023 మే లో మైఖేల్ డోలన్ అనే వ్యక్తితో జీవితాన్ని ప్రారంభించింది. ఇలియానా తరచుగా తన సోషల్ మీడియా అతని చిత్రాలను పంచుకుంది. మే లో, ఆమె తన బేబీ బంప్‌ను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను కూడా షేర్ చేసింది.
జూన్‌లో ఆమె తన ప్రెగ్నెన్సీ అనుభవాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్‌ను రాసుకొచ్చింది. తల్లిగా ఉండడం ఓ గొప్ప వరం. ఈ అనుభూతిని పొందుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి ఈ అవకాశం నన్నొక అదృష్టవంతురాలిని చేసింది. దీనిని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. చాలా రోజులుగా నేను నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చూస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను వావ్ - నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను అంటూ రాసుకొచ్చింది.

ఇలియానా చివరిసారిగా సబ్ గజాబ్ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించారు. ఆమె చివరి చిత్రం ది బిగ్ బుల్, అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించారు. ఇది 2021లో విడుదలైంది. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం మిశ్రమ విమర్శకుల స్పందనను పొందింది. ఆమెకు అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ ,లవర్స్ అనే రెండు సినిమాలు ఉన్నాయి. ఇలియానా విద్యాబాలన్, ప్రతీక్ గాంధీతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుందని మీడియా వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications