సుడిగాలి సుధీర్‌ను మిస్ చేసుకున్నందుకు గట్టిగా ఏడ్చేసింది

సుడిగా సుధీర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండితెర ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోద్వారా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని తర్వాత యాంకర్ గా మారాడు. పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే జబర్దస్త్ లో రాంప్రసాద్, గెటప్ శ్రీనుతో కలిసి అద్భుతమైన స్కిట్లు చేశాడు. క్రమేణా సినిమాల్లో హీరోగా అవకాశాలు వస్తుండటంతో అటువైపు వెళ్లాడు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం ప్రస్తుతం లేదు. ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్లీ బుల్లితెరపై యాంకరింగ్ చేస్తున్నాడు సుధీర్. ఈటీవీ, మాటీవీతోపాటు పలు టీవీషోల్లో పాల్గొంటున్నాడు.

కళ్లజోడు తీసినప్పుడు భోరున ఏడ్చేశా
ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించి, ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోవడంవల్ల ఎంతో బాధపడ్డానని చెప్పారు. తర్వాత కెవ్వు కార్తీక్ సుధీర్ వెళ్లిపోవడంపై ఓ స్కిట్ చేశాడని, అచ్చం సుధీర్ లానే కళ్లజోడు తీసి పెట్టుకుంటుంటే సుధీర్ గుర్తుకువచ్చి అక్కడే భోరున ఏడ్చేశానని ఇంద్రజ చెప్పారు. సుధీర్ తన కన్నకొడుకు లాంటివాడని, తనను రాజీ అని పిలుస్తుంటాడని, తాను సుధీర్ ను సిద్ధు అని పిలుస్తుంటానని ఇంద్రజ చెప్పారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో నటుడు ప్రవీణ్ కూడా తనను అమ్మా అని పిలుస్తుంటాడని, తనదగ్గరున్న వాచ్ ను ప్రవీణ్ కు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు.

actress indraja about her bond with sudigali sudheer and his character

అతను తనకు దేవుడిచ్చిన కొడుకు
ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన కొడుకులాంటివాడని ఇంద్రజ చెప్పారు. షోలో చేసే నటులంతా తనను మేడం అని, అక్కా అని పిలవడంకన్నా అమ్మా అని పిలిపించుకోవడంలోనే తనకు ఎంతో ఆనందం ఉందన్నారు. సుధీర్ అమ్మా అని పిలిచినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానన్నారు. తన పిల్లలకు కూడా తాను ఎంతో స్వేచ్ఛను ఇస్తానని, వారి పెళ్లి విషయంలో కూడా ఎటువంటి జోక్యం చేసుకోను అన్నారు. పెళ్లికావడానికి ఆరు సంవత్సరా ముందునుంచే తన భర్త తనకు తెలుసని, పలు తమిళ సీరియల్స్ లో నటించడంతోపాటు కొన్నింటికి స్క్రిప్ట్ లు కూడా సమకూరుస్తారని చెప్పారు. మీఇద్దరూ కలిసి ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదని యాంకర్ అడిగిన ప్రశ్నకు తామిద్దరం మీడియా ముందుకు రావాల్సిన అవసరం రాలేదని ఇంద్రజ చెప్పారు. ప్రస్తుతం సినిమాల్లో సహాయ పాత్రల్లో నటిస్తుండటంతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+