పెద్ది వివాదంపై జాన్వీ షాకింగ్ కామెంట్స్.. ఆ బాధ జీవితాంతం ఉంటుందంటూ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సినిమా 'పెద్ది'. ఆ చిత్రంలో తన పాత్రను చిత్రీకరించిన విధానంపై, ఆ సినిమా చుట్టూ ముసురుకున్న వివాదాలపై బాలీవుడ్ నటి జాన్వీకపూర్ ఎట్టకేలకు నోరు విప్పింది. తన పాత్రను అతిగా లైంగికీకరించారని, షూటింగ్ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందని ప్రముఖ చాట్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9'లో చెప్పింది. తన వంతు బాధ్యతను అంగీకరిస్తూ, మళ్లీ ఇలా జరగకుండా చూసుకుంటానని పేర్కొంది. కానీ ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు హద్దులు దాటాయని, ఆ అవమానభారాన్ని తాను జీవితాంతం మోయాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు.

'అర్జున’గా పవర్ స్టార్.. ముగ్గురు స్టార్ డైరెక్టర్ల పోటీ?
'అర్జున’గా పవర్ స్టార్.. ముగ్గురు స్టార్ డైరెక్టర్ల పోటీ?

అతిగా ఆబ్జెక్టిఫికేషన్ చేశారు.. తప్పు నాదే: జాన్వీ కపూర్
ఈ వివాదంపై జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. "సినిమా కోసం చాలా మంది కష్టపడి పనిచేశారు. మొదట్లో దీనిపై మాట్లాడాలో లేదో అర్థం కాలేదు. కానీ ఈ సినిమా సమాజంపై, ముఖ్యంగా మహిళలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో నా బాధ్యతను నేను గుర్తించాను. ఆ అవమానాన్ని నేను ఇప్పటికే మోస్తూనే ఉంటాను. నేను మరింత జాగ్రత్తగా ఉండాల్సింది, నా పాత్రను విశ్లేషించుకోవాల్సింది.. దీనికి 100 శాతం నేనే బాధ్యత వహిస్తాను" అని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు. అలాగే తన పాత్రను తీవ్రంగా ఆబ్జెక్టిఫై చేశారని, మహిళల పట్ల ప్రదర్శించిన తీరు సమస్యాత్మకంగా ఉందనే విమర్శలతో తాను ఏకీభవిస్తున్నట్లు జాన్వీ కపూర్ అంగీకరించారు.

Actress Janhvi Kapoor Calls Peddi Scene Uncomfortable Facing Backlash Over South Industry Remarks

దక్షిణాది సినిమా ఇండస్ట్రీపై కామెంట్స్
దక్షిణాది సినిమా ఇండస్ట్రీ పనితీరుపై కూడా జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దక్షిణాది సినీ పరిశ్రమలో ముందస్తుగా సంపూర్ణమైన స్క్రిప్టులు లేదా కెమెరా యాంగిల్స్ గురించిన వివరాలు నటీనటులకు ఇవ్వడం చాలా అరుదని పేర్కొన్నారు. ఉన్న గుర్తింపును, ప్రివిలేజ్‌ను ఉపయోగించి ముందే పూర్తి స్క్రిప్ట్ డిమాండ్ చేసి ఉండాల్సిందని జాన్వీ కపూర్ అన్నారు. ఆ సినిమాలో కొన్ని సీన్ల చిత్రీకరణ సమయంలో తనకు ఓ రకమైన మానసిక వేధింపుల అనుభూతి కలిగిందని, అయితే ఈ వివాదం ద్వారా భవిష్యత్తులో డైరెక్టర్లు హీరోయిన్లను ఇలా చూపించే ముందు వందసార్లు ఆలోచిస్తారని తాను భావిస్తున్నట్లు జాన్వీ కపూర్ వెల్లడించారు.

'ఇరుముడి' దర్శకుడితో బాలయ్య పవర్ ఫుల్ సినిమా..!
'ఇరుముడి' దర్శకుడితో బాలయ్య పవర్ ఫుల్ సినిమా..!

వివాదానికి దారితీసిన సీన్లు
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను క్యారెక్టర్ డెవలప్‌మెంట్ లేకుండా కేవలం శరీరాకృతిపైనే ఎక్కువ దృష్టిసారించారని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కరెంట్ పోయిన సమయంలో కథానాయిక ఇష్టంతో సంబంధం లేకుడా, ఆమె నిరాకరిస్తున్నప్పటికీ.. రామ్‌చరణ్ పాత్ర వచ్చి ముద్దు పెట్టుకునే సన్నివేశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆ సీన్ లైంగిక దాడికి ప్రోత్సాహకరంగా ఉందంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.

జాన్వీపై నెటిజన్ల విమర్శలు
ప్రస్తుతం జాన్వీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు కూడా తమదైన పద్ధతిలో కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణాది సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ సినిమాల్లో నటీనటులు హద్దులు మరింత మీరుతారని గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ ఇకపై జాన్వీకపూర్‌కు అవకాశాలు ఇవ్వకూడదని ఫిల్మ్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. పెద్ది చిత్రం డైరెక్ట్ బుచ్చిబాబు అచ్చియమ్మ క్యారెక్టర్ గురించి పూర్తిగా చెప్పిన తర్వాతే జాన్వీకపూర్ ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకుందని.. ఇప్పుడు విమర్శలు వచ్చేసరికి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తోందని నెటిజన్లు మండిపడ్డారు. అంతకుముందు రాధికా ఆప్టే, తాప్సీలు కూడా టాలీవుడ్‌లో అవకాశాలు పొంది ఆ తర్వాత తెలుగు మేకర్స్ పై విమర్శలు గుప్పించారని ఇప్పుడు ఆ జాబితాలోకి జాన్వీ చేరిపోయిందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+