కొండా సురేఖ చూపు గులాబీ వైపు .. తాజా ట్వీట్‌తో హాట్ డిబేట్!

మంత్రి పదవి కోల్పోయిన తర్వాత చాలా కాలం నిశ్శబ్దంగా ఉన్న కొండా సురేఖ ఒక్క ట్వీట్‌తో మళ్లీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు కారణం అయ్యారు. తాజా ట్వీట్‌లో రెండేళ్ల క్రితం ఓ హీరోయిన్, కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని పేర్కొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ఆమె చూపు మళ్లీ గులాబీ వైపు మళ్లిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గతంలో కూడా కొండా సురేఖ రాజకీయ ప్రయాణం అంతా దిక్కార స్వరంతోనే సాగింది. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరి వరంగల్ తూర్పు నుంచి గెలిచారు. కానీ మంత్రి పదవి రాకపోవడంతో 2018లో కాంగ్రెస్‌లోకి మారారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో మంత్రి పదవి కోల్పోయిన తర్వాత మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ భర్త కొండా మురళీ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Konda Surekha Latest Tweet Sparks Debate konda family Eyes on BRS After Losing Minister Post

మంత్రి పదవి పోయిన వెంటనే కొన్ని గంటల్లోనే కేసీఆర్‌ను మంచివారని, హుందాగా వ్యవహరిస్తారని ప్రశంసించడం కూడా అప్పట్లో వారి చూపు బీఆర్ఎస్ వైపు ఉన్నట్టు చర్చ జరిగింది. ట్రబుల్ షూటర్ ద్వారా మళ్ళీ పార్టీలోకి వెళ్లాలని ప్రయత్నం చేసినట్టు టాక్ వినిపించింది. అయితే గతంలో కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేయటం ఆమెకు మైనస్ అయ్యిందని సమాచారం.

ఈ క్రమంలో గతంలో కేటీఆర్ మీద కామెంట్స్ చేసి కేసులు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం ఫీల్ అవ్వటం, అదీ బాహాటంగా సోషల్ మీడియా ద్వారా చెప్పటం దీంతో బీఆర్ఎస్‌లోకి తిరిగి చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతోంది.

హరీశ్‌రావు వంటి నేతల ద్వారా సంప్రదింపులు సాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్ స్వాగతిస్తారా అన్న సందేహం కూడా ఉంది. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ఈ చర్చకు మరింత ఊపు ఇస్తున్నాయి. 66 డివిజన్లున్న గ్రేటర్ వరంగల్‌లో 25 డివిజన్లు వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. కొండా దంపతుల ప్రభావం ఇక్కడ బలంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సంక్రాంతి నుంచి రేషన్ లబ్దిదారులకు మరో తీపికబురు సిద్ధం చేస్తున్న తెలంగాణా ప్రభుత్వం
సంక్రాంతి నుంచి రేషన్ లబ్దిదారులకు మరో తీపికబురు సిద్ధం చేస్తున్న తెలంగాణా ప్రభుత్వం

వారి కుమార్తె సుస్మితను రాజకీయాల్లోకి తీసుకురావడానికి కూడా ఈ ఎన్నికలను వినియోగించుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు. అయితే కొండా సురేఖ ఇప్పటివరకు అధికారికంగా తన రాజకీయ ప్రయాణంపై ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ తాజాగా చేసిన ఒక్క ట్వీట్‌తోనే రాజకీయ చర్చలు మళ్లీ మొదలయ్యాయి. గ్రేటర్ వరంగల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆమె తదుపరి అడుగు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+