వారణాసి, బెంగళూరుకు వందే భారత్ స్లీపర్- రిజర్వేషన్ షురూ, రూట్.. షెడ్యూల్..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల సౌకర్యార్ధం కొత్తగా మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. అందులో వారణాసి- ఢిల్లీ మధ్య అక్టోబర్ 31న ప్రారంభం కానుంది. అదే విధంగా నవంబర్ 1వ తేదీన ఏపీ మీదుగా ప్రయాణించే ముంబాయి- బెంగళూరు వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కనుంది. ఈ రెండు రైళ్లకు సంబంధించిన రూట్, షెడ్యూల్ ఇప్పటికే ఖరారు చేసారు. రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో.. వారణాసి వెళ్లే ప్రయాణీకులకు మరింత వెసులుబాటు కలగనుంది.
రైల్వే ప్రయాణీకులకు కొత్తగా మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక రోజు తేడాతో ఈ రెండు రైళ్లు ప్రారంభం అవుతున్నాయి. ముంబై - బెంగుళూరు రైలు సుమారు 1000 కిలోమీటర్ల ప్రయాణాన్ని 15 గంటల 45 నిమిషాల్లో చేరనున్నది. ఇక వారణాసి-ఢిల్లీ రైలు ప్రయాగ్రాజ్, కాన్పూర్ మీదుగా ప్రయాణిస్తుంది. వారణాసి-ఢిల్లీ రైలు వారణాసిలో రాత్రి 8.50 నిమిషాలకు స్టార్ట్ అయి, తెల్లవారుజామున 5.55 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో ఢిల్లీ నుంచి రాత్రి 9.40 నిమిషాలకు మొదలై,వారణాసికి ఉదయం 6.45కు చేరుకుంటుంది. యూపీలోని నాలుగు కీలక నగరాల్లో ఇది ఆగనుంది. ప్రయోగరాజ్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్, ఘజియాబాద్ స్టేషన్లలో స్టాపులు కల్పించారు. యూపీలోని అనేక ప్రధాన నగరాల నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించడంలో ఇది కీలకంగా మారనుంది.

రైల్వే శాఖ తాజా నిర్ణయంతో
అదే విధంగా ముంబై-బెంగుళూరు రైలు సీఎస్ఎంటీ స్టేషన్ నుంచి రాత్రి 8.10 నిమిషాలకు కదులుతుంది. తెల్లవారుజామున ఉదయం 11.55 నిమిషాలకు ఎస్ఎంవీటీ బెంగుళూరు చేరుకుంటుంది. ఇక రిటర్న్ జర్నీలో బెంగుళూరు నుంచి రాత్రి 7.50 నిమిషాలకు బయలుదేరి సీఎస్ఎంటీ 11.55 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ రైలు వల్ల సుమారు 6 గంటల 20 నిమిషాల పాటు ప్రయాణ సమయం తగ్గనున్నది. ఈ రైలు ఏపీలోని అనంతపురం, గుంతకల్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనుంది. కాగా.. త్వరలోనే సికింద్రాబాద్- ఢిల్లీ, విశాఖ - బెంగ ళూరు మధ్య వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశ పెట్టేందుకు కసరత్తు కొనసాగుతోంది. విజయవాడ నుంచి అయోధ్య వందేభారత్ స్లీపర్ ప్రతిపాదన పైనా అధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
