మోహన్ బాబు ముందు పైట తీయమన్నారు.. కానీ నో చెప్పా !
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ నటి జయలక్ష్మి సుపరిచితురాలే. డాన్సర్ గానే కాకుండా ఆర్టిస్టుగా కూడా రాణించి సత్తా చాటారు. మొదట్లో యాంకర్ గా వ్యవహరించిన ఆమె ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. అయితే ఈమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో ఓ సినిమాలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి నోరువిప్పింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ డైరెక్టర్ దాసరి నారాయణ రావుని.. సీనియర్ హీరో మోహన్ బాబు గురువుగా భావిస్తారు. ఈ క్రమంలోనే దాసరి భార్య పద్మతో కూడా జయలక్ష్మి గారికి మంచి అనుబంధం ఉంది. ఒకసారి వాళ్లింటికి వెళ్ళినపుడు ఆమె.. మోహన్ బాబుకి జయలక్ష్మిని పరిచయం చేశారట. మనకు తెలిసిన అమ్మాయి నీ సినిమాలో ఏదైనా అవకాశం ఇవ్వు అని కూడా చెప్పారట. ఆవిడ అడిగారనే మోహన్ బాబు ఒక సినిమాలో కలెక్టర్ భార్య పాత్ర కోసం అవకాశం ఇచ్చారట. అయితే అందులో కలెక్టర్ భార్య మోహన్ బాబు ముందు పైట జార్చి సర్దుకునే సీన్ ఉందట. అందుకు తాను ఇబ్బంది పడ్డానని చేయనని చెప్పినట్టు వెల్లడించారు.

దాంతో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లతో అదే విషయం చెప్పగా ఇప్పటికే.. కొంత షూటింగ్ పూర్తి అయ్యిందని ఇపుడు మీరు ఇలా చేస్తే ఎలా అంటూ కోప్పడ్డారట. మోహన్ బాబు కోప్పడతారు.. మేము మేనేజ్ చేస్తాం ఎలాగోలాగా మీరు చేయండి అంటూ అడిగారట. అయితే విషయం గమించిన మోహన్ బాబు ఏమిటి సమస్య అని అడిగితే ఆ సన్నివేశం నేను చేయలేను అంటూ చెప్పారట. ఇక మోహన్ బాబు సైతం వేరే ఆర్టిస్ట్ ని రమ్మని ఆ సీన్ చేయించారట.
తనని ఏమి అనకుండా పంపించారాని సెట్ లో ఉన్న వాళ్లందరూ బాగా షాక్ అయ్యారట. ఆయన కోప్పడకుండా మౌనంగా పంపించారు ఇలా మీకే జరిగినట్లుంది అని అన్నారట. తన ఇబ్బందిని అర్ధం చేసుకొని వేరే నటితో సీన్ చేయించినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి అని అన్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా తాను అలాంటి పాత్రలు చేయలేదని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మోహన్ బాబు సైతం ఎప్పుడు కనిపించినా మంచిగా పలకరిస్తారని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications