నాగార్జున హీరోయిన్ అర్ద నగ్న ఫొటోలు లీక్ ..మండిపడ్డ బ్యూటీ
సోషల్ మీడియా వచ్చిన తరువాత తారతమ్యాలు లేకుండా పోయాయి. ఎక్కడ నుంచైనా ఎవరితోనైనా నేరుగా మాట్లాడే సౌలభ్యం అందరికి దక్కింది. ముఖ్యంగా సెలబ్రిటీలతో డైరెక్టుగానే కనెక్ట్ అయ్యే అవకాశం అభిమానులకు దక్కుతుంది. అయితే సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన హీరో, హీరోయిన్లతో మాట్లాడే వారు కొందరైతే.. మరి కొందరు సోషల్ మీడియాను మిస్ యూజ్ చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల హీరోయిన్లు, సీనియర్ యాక్టర్స్ ఇబ్బందిపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
తాజాగా ఇలాంటి ఘటనే సీరియల్ యాక్టర్ అయిన కస్తూరి శంకర్‌కు ఎదురైంది. అన్నమయ్య సినిమాతో కస్తూరి శంకర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కొంతకాలం నటనకు గ్యాప్ తీసుకున్న కస్తూరి శంకర్.. తిరిగి సీరియల్స్, వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఆర్టిస్ట్‌గా మారిపోయింది. ఇక లైంగిక వేధింపుల గురించి అమ్మడు తనదైనశైలిలో స్పందిస్తుంటుంది.సినిమా ఇండస్ట్రీలో తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని, ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎదురయిందని గుర్తు చేసుకుంది.

ఓ బిగ్ ప్రాజెక్టులో హీరోయిన్ గా తీసుకున్నారని, ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అవకాశాన్ని లాగేసుకున్నారని చెప్పుకొచ్చింది.ఇదిలా ఉంటే తాజాగా కస్తూరికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. అవి కూడా అర్ధ నగ్న ఫొటోలు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కస్తూరి ఇటీవల బిడ్డకు పాలు ఇస్తూ అర్ధనగ్నంగా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోస్ అప్పట్లో రచ్చ సృష్టించింది. తాజాగా ఈ ఫొటో షూట్‌పై అమ్మడు స్పందించింది.
అసలు ఆ ఫోటోలు నా అనుమతి లేకుండా ఇండియాలోని ప్రముఖ మీడియా కంపెనీనే సెన్స్ లేకుండా వాటిని దొంగిలించి పబ్లిష్ చేసిందని మండిపడింది. అసలు ఆ ఫోటోషూట్ నేను ఇండియా కోసం చేయలేదు. అమెరికాలో తల్లిబిడ్డల మాతృత్వం గురించి ఒక మ్యాగజైన్ వారు అడిగితే ఓకే చెప్పాను. దాన్ని ఇండియాలో రిలీజ్ చేయకూడదని అప్పుడే వారికి చెప్పాను, కానీ కనీసం నన్ను కూడా సంప్రదించకుండా ఇండియాలో లీక్ చేశారు. ప్రస్తుతం ఈ అర్ధ నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications