ఆ కేసులో నాగార్జున హీరోయిన్ అరెస్ట్..!
నటి కస్తూరి శంకర్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రాజకీయ సభలో ఆమె మాట్లాడుతూ..అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగువారు వచ్చారంటూ కస్తూరి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు వారిని కించపరుస్తూ మాట్లాడటంపై తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. వివాదం పెద్దది కావడంతో వెంటనే తాను అలాంటి ఉద్దేశంతో అనలేదని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. మూడు రోజుల క్రితం కస్తూరిపై చెన్నైలో కేసులు నమోదవ్వగా.. ఆమెకు సమన్లు జారీ చేసేందుకు పోలీసులు ఇంటికెళ్లారు.
ఆమె ఇంటికి తాళం వేసి ఉండటంతో ఫోన్ చేశారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది. అరెస్ట్ చేస్తారనే భయంతో నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కస్తూరి శంకర్ హైదరాబాద్‌లో ఉన్నారనే సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు, ఇక్కడ ఆమెను అదుపులోకి తీసుకున్నారు.గచ్చిబౌలిలో ఆమె ఉన్నట్టు సమాచారం అందుకున్న చైన్నై పోలీసులు శనివారం కస్తూరి శంకర్ ఉన్న ప్రదేశానికి చేరుకుని అరెస్ట్ చేశారు.తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరినప్పటికీ హైకోర్టు ఆమె పిల్‌ను కొట్టివేసింది. దీంతో కస్తూరి శంకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా, హైదరాబాద్‌లో ఉన్నారని ఆచూకి లభ్యమైంది. కస్తూరి శంకర్‌ను ప్రస్తుతం పోలీసులు చైన్నై తరలిస్తున్నారు. నటి కస్తూరి శంకర్ గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. తమిళ స్టార్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చెల్లెలుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది.
కొంతకాలం నటనకు గ్యాప్ తీసుకున్న కస్తూరి శంకర్.. తిరిగి సీరియల్స్, వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఆర్టిస్ట్‌గా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ ఇలా సౌత్‌లోని నాలుగు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు, సీరియల్స్‌తో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అయితే అమ్మడు తన వ్యాఖ్యలతో తరుచూ వివాదాల్లో నిలుస్తుంటుంది. ఆ మధ్య బిగ్‌బాస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. తాజాగా ఈ భామ తెలుగు వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయింది.












Click it and Unblock the Notifications