ఆ హీరోతో మరోసారి అలా చేయాలని ఆశ పడుతున్న హీరోయిన్..

తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో ముంబై బ్యూటీ 'కావ్య థాపర్' ఒకరు. మోడలింగ్ ద్వారా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో 'ఈ మాయ పేరేమిటో' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ తర్వాత సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ అందుకొని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ భామ.. తమిళ్ లోనూ ఛాన్స్ లు దక్కించుకుంటుంది. ఇప్పటికే తెలుగులో బిచ్చగాడు 2, ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాల గురించి పోస్ట్ చేస్తూ.. హాట్ ఫొటోలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.

actress-kavya-thapar-comments-about-her-crush-goes-viral

అయితే సాధారణంగా హీరోయిన్లకు కూడా ఫేవరెట్ హీరోలు, హీరోయిన్స్ ఉంటారు. వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని.. రొమాన్స్ చేస్తే బాగుంటుందని ఆశపడే వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తనకు ఓ బాలీవుడ్ హీరో అంటే పిచ్చి అని మనసులో మాట బయటపెట్టింది కావ్య. ఆయనతో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అంటూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో ఆ భామ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు హీరో షాహిద్ కపూర్ పై క్రష్ ఉందని కావ్య వెల్లడించారు. ఆయనతో కలిసి నటించడం జీవితంలో మరిచిపోలేనని చెప్పారు. వీరిద్దరూ కలిసి గతంలో ఫర్జీ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. మరోసారి ఆయనతో కలిసి రొమాన్స్ చెయ్యాలని ఆశ పడుతున్న అంటూ కామెంట్స్ చేసింది. మరి ఈ ముద్దుగుమ్మ కోరిక తీరుతుందో లేదో చూడాలి.

ఇక 2013లో హిందీలో ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది కావ్య. ఆ తర్వాత మోడల్‌గా పతంజలి, మేక్ మై ట్రిప్ సహా పలు ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారించింది. ఏక్ మినీ కథ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ.. తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. భారీ అంచనాలు పెట్టుకొని నటించిన డబుల్ ఇస్మార్ట్ మూవీ భారీ డిజాస్టర్ అవ్వడంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. రీసెంట్ గా గోపీచంద్ తో కలిసి నటించిన విశ్వం సినిమా సైతం ఆమెకు ఛాన్స్ లు అందేలా చేయలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో ఒక మూవీ చేస్తుండగా.. తమిళ్ లోనూ పలు చిత్రాల్లో నటిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+