నా కుటుంబం మొత్తాన్ని చేతబడి చేసి చంపారు - బుల్లితెర బ్యూటీ

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి "కీర్తి భట్". సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె, Bigg Boss Telugu Season 6లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె చూపించిన సహనం, భావోద్వేగ గాథ ప్రేక్షకులను ఆకట్టుకుని, ఆమెకు ఒక పాజిటివ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం బుల్లితెరపై అవకాశాలతో బిజీగా ఉంటూ, తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

అయితే కీర్తి భట్ జీవితంలో కనిపించని ఒక గాఢమైన గతం ఉందని తెలుస్తోంది. కన్నడ కుటుంబానికి చెందిన ఆమె చిన్నతనం ఎంతో సుఖసౌకర్యాల మధ్య గడిచింది. తండ్రి వ్యాపారవేత్త కావడంతో కుటుంబం ఆర్థికంగా బలంగా ఉండేది. కానీ 2017లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అంటున్నారు. ఆ ప్రమాదంలో తల్లిదండ్రులు, అన్న, వదినలను కోల్పోయిన కీర్తి... తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ కొంతకాలం కోమాలో కూడా ఉన్నారని వాపోతున్నారు.

actress-keerthi-bhatt-emotional-comments-about-her-family-members-deaths-and-black-magic-also-accide

కాగా ఈ ప్రమాదం తర్వాత పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారాయని.. ఆస్తుల విషయంలో కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయని.. తాను కోమాలో ఉన్న సమయంలోనే వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగాయని కీర్తి వెల్లడించారు. ఈ సంఘటనలే తనకు అనుమానాలకు కారణమయ్యాయని, కొన్ని కుట్రలు కూడా జరిగి ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు. కోమా నుంచి బయటపడ్డ తర్వాత కూడా ప్రశాంత జీవితం దక్కలేదని ఎమోషనల్ అయ్యారు.

ఇంట్లో సరైన ఆహారం కూడా ఇవ్వకుండా, ఒత్తిడికి గురిచేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక చివరకు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. తనపై మిస్సింగ్ కేసు పెట్టి తిరిగి బలవంతంగా తీసుకెళ్లిన ఘటనలు, పోలీస్ స్టేషన్‌లో ఎదురైన అనుభవాలు ఆమె జీవితంలో మరపురాని చేదు జ్ఞాపకాలుగా మిగిలాయి. తన పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోలేదనే బాధను ఆమె పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు.

మరీ ముఖ్యంగా ప్రమాదం వెనుక సహజ కారణాలు మాత్రమే లేవని, తన బంధువుల కుట్ర కూడా ఉందని కీర్తి సంచలన ఆరోపణలు చేశారు. తన అమ్మానాన్నపై బ్లాక్ మ్యాజిక్, చేతబడి చేయించారని.. నాన్న ఎదుగుదలను ఓర్వలేక కొందరు బంధువులు ఇలా చేశారు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకే కారులో తాను, అమ్మ, నాన్న ఉంటే.. వాళ్లు చనిపోయారని.. తాను మాత్రం ప్రాణాలతో బయటపడ్డానని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+