అతని వల్ల అనుకోకుండా గర్భవతినయ్యాను - యంగ్ హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే.తాజాగా ఓ హీరోయిన్ తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించిన విషయాన్ని బయటపెట్టారు.స్నేహితుడితో ఒక రాత్రి గడిపడం వల్ల గర్భవతి కావడంతో, ఎవరికి తెలియకుండా అబార్షన్ చేయించుకున్నానని ఓ హీరోయిన్ వెల్లడించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..కుబ్రా సేథ్.
తెలుగు ప్రేక్షకులకు కుబ్రా సేథ్ పెద్దగా తెలికపోవచ్చు కానీ.. బాలీవుడ్ జనాలకు కుబ్రా సేథ్ సుపరిచితురాలే. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కుబ్రా సేథ్, తర్వాత యాంకర్‌గా మారింది. అక్కడ ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు తర్వాత నటిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కుబ్రా సేథ్ బాలీవుడ్‌లో తన కెరీర్‌ను 2011లో "రెడీ" సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.ఆమె "సేక్రేడ్ గేమ్స్" అనే వెబ్ సిరీస్‌లో కుకు పాత్రతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆమె "రెడీ", "జవానీ జానెమన్", "జోడి బ్రేకర్స్", "సుల్తాన్", "గల్లీ బాయ్" వంటి అనేక బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించారు.

కుబ్రా సేథ్ అనేక వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు. ఆమె "ట్రిప్లింగ్", "ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!", "ది వర్డాక్సీ షో" వంటి వెబ్ సిరీస్‌లలో నటించారు. ఆమె "సేక్రేడ్ గేమ్స్" వెబ్ సిరీస్‌లో కుకు పాత్రతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా ఈ భామ 'ఓపెన్ బుక్' అనే తన జీవిత పుస్తకాన్ని రాసింది. ఇందులో తాను ఒక రాత్రి వల్ల గర్భవతినయ్యానని ఈ పుస్తకంలో వెల్లడించింది. అయితే దానికి గల వ్యక్తి పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు.ఎవరికీ తెలియకూడదని రహస్యంగా గర్భస్రావం చేయించుకునని ఈ బ్యూటీ తెలిపింది. దాదాపు 12 సంవత్సరాల తరువాత, కుబ్రా ఆ సంఘటన గురించి బహిరంగంగా వెల్లడించింది.












Click it and Unblock the Notifications