బ్రేకప్ తర్వాత మందుకు బానిసయ్యా.. నలుగురితో రొమాన్స్, ఇద్దరితో పెళ్లి !!
హిందీ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి "కునికా సదానంద్". ముఖ్యంగా ర్యాప్ సాంగ్స్, నెగెటివ్ పాత్రలు, బోల్డ్ రోల్స్‌తో కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఆ క్రేజ్ తోనే టెలివిజన్ సీరియల్స్, సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకొని స్టార్ నటిగా ఎదిగారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే వ్యక్తిగత జీవితంలో వివాదాల కారణంగా వార్తల్లో నిలిచారు.
ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ సీజన్ 19లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.
అయితే తన కుటుంబం, వ్యక్తిగత విషయాల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడే ఈమె.. బిగ్‌బాస్ హౌస్‌లో తనకున్న చెడు అలవాట్ల గురించి రివీల్ చేసింది. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ అటు కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులను కూడా షాక్ కి గుర్ చేశాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి.

కునికా సదానంద్ మాట్లాడుతూ.. తానెప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్లలేదని తెలిపింది. కానీ తనకు మందు తాగే అలవాటుందని.. బ్రేకప్ అయినప్పుడు మందుకు బానిసయ్యానని వెల్లడించారు. ఎక్కువ తాగడం వల్లే బరువు పెరిగిపోయానని.. డబ్బింగ్ చెప్పడానికి స్టూడియో వెళ్లినప్పుడు తనని తాను అద్దంలో చూసుకుని షాకయ్యానని వాపోయింది. పట్టపగలే బీర్ తాగేదాన్ని అని.. రాత్రి సమయంలో క్లబ్ కు వెళ్లి మళ్లీ మందు తాగుతూ కూర్చునేదాన్ని అని చెప్పుకొచ్చింది. మందు విషయంలో తన తండ్రి హెచ్చరించినా కూడా పట్టించుకోలేదని వివరించింది.
ఇక తన రిలేషన్స్ గురించి చెబుతూ.. ఇద్దరితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు రివీల్ చేసింది. అలానే నలుగురితో రొమాన్స్, రెండు పెళ్లిళ్లు చేసుకున్నానని కునికా అన్నారు. కునికా.. మొదట ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉండగా.. విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్‌ను పెళ్లి చేసుకోగా.. ఓ కుమారుడు జన్మించాడు. ఈ జంట కూడా కొంత కాలం తర్వాత విడిపోయారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 27 ఏళ్ల వయసులోనే తాను ప్రముఖ గాయకుడు కుమార్ సనుతో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నానని వెల్లడించింది. అప్పట్లో కుమార్ సను తన భార్యతో విడాకులు తీసుకున్న సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని.. షూటింగ్ సమయంలో ఆత్మహత్యకు యత్నించారని తెలిపింది. ఆ సమయంలో ఆయనకు ఎమోషనల్ సపోర్ట్‌గా నిలిచానని.. ఆ తర్వాత వారి మధ్య ఉన్న బంధం లివ్-ఇన్ రిలేషన్‌గా మారిందని అంగీకరించింది. ఆ తర్వాత కుమార్ సను తనను మోసం చేసి మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది.
-
బాలీవుడ్ సూపర్ స్టార్ సరసన సమంత? -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications