మా అమ్మకి బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పు ఏంటీ..??
బాలీవుడ్‌లో ఒకప్పుడు తన నటనతో, ర్యాప్ సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి "కునికా సదానంద్". అంతే కాకుండా నెగెటివ్ పాత్రలు, బోల్డ్ రోల్స్‌తో కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఆ క్రేజ్ తోనే టెలివిజన్ సీరియల్స్, సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకున్నారు.
కానీ ఆమె కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే వ్యక్తిగత జీవితంలో వివాదాల కారణంగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అనూహ్యంగా అదే విషయాలపై ఆమె కుమారుడు ఓపెన్ అయ్యారు. మా అమ్మకు బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి అంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ 19లో ఎమోషనల్ ఎపిసోడ్..
ప్రస్తుతం కునికా సదానంద్ హిందీ బిగ్ బాస్ 19లో కంటెస్టెంట్‌గా ఉంది. ఇంటి సభ్యులు ఆమె వ్యక్తిత్వం, గతం గురించి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో ఆమె కుమారుడు అయాన్ వచ్చి తల్లికి మద్దతు ఇచ్చాడు. తల్లిగా కునికా తన కుమారులను పెంచుకునే క్రమంలో ఎదుర్కొన్న కష్టాలను.. ఒంటరిగా పిల్లలను చూసుకున్న కష్టకాలాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఆ తరువాత ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ.. ఈ వయసులో నాకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటే.. నా తల్లికి యుక్తవయసులో బాయ్‌ఫ్రెండ్స్ ఉండటం తప్పేంటి? యుక్తవయసులో ఇది సహజం. అమ్మను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ తల్లికి అండగా నిలిచాడు. ప్రస్తుతం అయాన్ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఫ్లాష్ బ్యాక్..
కునికా సదానంద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 27 ఏళ్ల వయసులోనే తాను ప్రముఖ గాయకుడు కుమార్ సనుతో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నానని వెల్లడించింది. అప్పట్లో కుమార్ సను తన భార్యతో విడాకులు తీసుకున్న సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని.. షూటింగ్ సమయంలో ఆత్మహత్యకు యత్నించారని తెలిపింది. ఆ సమయంలో ఆయనకు ఎమోషనల్ సపోర్ట్‌గా నిలిచానని.. ఆ తర్వాత వారి మధ్య ఉన్న బంధం లివ్-ఇన్ రిలేషన్‌గా మారిందని అంగీకరించింది. అయితే తాను ఆ రిలేషన్‌షిప్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నప్పటికీ.. కుమార్ సను తనను మోసం చేసి మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది.
-
నటి హేమ పబ్ వీడియో వైరల్.. నేనెప్పుడూ తప్పు చేయనంటూ..! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
7.5 గంటల సినిమా? ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్! -
కొత్త `రామాయణం`- ప్రభాస్ మూవీపై భారీ ట్రోల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications