దర్శకుడు కమిట్మెంట్ అడిగితే అప్పుడు తిట్టా ..ఇప్పుడు అలా చేయను
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పలు సందర్భాల్లో బయటపెట్టడం జరుగుతుంది. గతంతో పోలిస్తే ఇటీవల నటులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా చెబుతున్నారు. తాజాగా మిర్చి నటి మాధవి తన కెరీర్‌లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి తెలపడం జరిగింది. మిర్చి మాధవికి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.
ముఖ్యంగా మిర్చి తర్వాత మాధవి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మిర్చి సినిమా హిట్ కావడంతో మాధవికి వరుస సినిమాల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి. మాధవి తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన కెరీర్ ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. ఒక సినిమాలో నన్ను సెలెక్ట్ చేశారు. డైరెక్టర్‌కి సంబంధించిన వ్యక్తి ఫోన్ చేసి.. మీకు ఈ చిత్రంలో పాత్ర ఉండాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి. మొత్తం 5 మంది ఉన్నాం అని అన్నాడు. ఇంకోక్కసారి ఫోన్ చేస్తే గుడ్డలూడదీసి కొడతా అని అరిచేశా.. వెంటనే అతను ఫోన్ పెట్టేశాడని నటి మాధవి తెలిపింది.

ఆ తర్వాత తనని ఎవరూ కమిట్మెంట్ అడగలేదని మిర్చి మాధవి తెలిపింది. అప్పుడు కొంపంలో తిట్టేశా. కానీ ఇప్పుడు ఎవరైనా అలా అడిగితే.. ఫోన్ పెట్టారా బాబు నాకు చాలా పని ఉంది అని ఊరుకుంటా. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిందని మిర్చి మాధవి అన్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఒకవైపే ఉండదు అని మాధవి అన్నారు. మనకి ఇష్టం లేకుంటే ఎవరూ టచ్ చేయరు. మనం చనువు ఇస్తేనే అవతలి వాడి రెచ్చిపోతాడు అని ఆమె తెలిపారు. కాస్టింగ్ కౌచ్ గురించి మిర్చి మాధవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications