ఆ హీరో వద్దన్న వినలేదు..హోటల్ గదికి వచ్చి ఒక్కసారి అంటూ..
1990ల్లో హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో మీనా కూడా ఒకరు. సౌందర్య తర్వాత రమ్యకృష్ణ, రోజా వంటి వారిని తట్టుకుని మరీ స్టార్‌డమ్ దక్కించుకున్నారు మీనా. దక్షిణాదిలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలై, అద్భుతమైన కథానాయికగా ఎదిగారు మీనా. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించి, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు.
ఇదే సమయంలో లేడీ ప్రాధాన్యత కథలను ఎంచుకుని ఫ్యామిలీ ఆడియోన్స్‌కు సైతం బాగా కనెక్ట్ అయ్యారు. వ్యక్తిగత జీవితంలో, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను వివాహం చేసుకున్నారు. దురదృష్టవశాత్తూ, భర్త మరణం తర్వాత కూతురు నైనికతో కలిసి ధైర్యంగా ముందుకు సాగుతూ, నటనను కొనసాగిస్తున్నారు. ఆ మధ్య మీనా రెండో పెళ్లి అంటూ కథనాలు వచ్చినప్పటికీ అవన్నీ కేవలం ప్రచారానికి మాత్రమే మిగిలిపోయాయి. తాజాగా మీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటలను వెల్లడించారు.

ఈ సందర్భంగా మీనా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తితో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి మీనా బయటపెట్టారు. మిథున్ చక్రవర్తికి ఊటీలో ఒక హోటల్ ఉండేది, అప్పట్లో సినిమా షూటింగ్‌లు అక్కడే ఎక్కువగా జరుగుతుండేవి. ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లిన మీనాను తనతో సినిమా ఎప్పుడు చేస్తావని, డేట్స్ ఎప్పుడు ఇస్తావని మిథున్ చక్రవర్తి అడిగేవారని ఆమె చెప్పుకొచ్చింది. తనతో ఒక్క సినిమా అయినా చేయండని ఆయన రిక్వెస్ట్ చేసేవారని మీనా తెలిపింది.
అయితే అప్పటికే నేను తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అతనితో సినిమాలు చేయలేదని, దీంతో ఆ హోటల్‌కు వెళ్లాలంటేనే భయం వేసిందని మీనా తెలిపింది. ఊటీలో షూటింగ్ ఉంటే మిథున్ చక్రవర్తి హోటల్లో రూమ్ బుక్ చేయవద్దని చెప్పేదాని అంటూ మీనా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనా చేసిన కామెంట్స్ సినీ రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.












Click it and Unblock the Notifications