వర్జినిటీ గురించి షాకింగ్ కామెంట్స్.. ఈరోజుల్లో కామన్ అంటూ !
బిగ్ బాస్ బ్యూటీ, నిర్మాత, నటి మిత్రా శర్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. బిగ్ బాస్ తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయితో ఓ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించి వార్తల్లో నిలిచారు. ఇక ఊహించని రీతిలో హర్ష సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద నుంచి రెండు కోట్ల వరకు డబ్బు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అప్పట్లో ఆమె హాట్ టాపిక్ అయ్యింది.
ప్రస్తుతం " వర్జిన్ బాయ్స్ " అనే సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. గీతానంద్, శ్రీహాన్, రోనిత్, అన్షులా, జెన్నిఫర్ ఇమ్మాన్యుయెల్ సహా పలువురు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజా దరపునేని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీని జూలై 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ గమనిస్తే అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. గ్యాప్ దొరికితే చాలు అన్నట్టు ముద్దులతో రెచ్చిపోతున్న సీన్స్ దర్శనమిస్తున్నాయి.

ఇక ఈ క్రమంలోనే కూటి కొరకు కోటీ విద్యలు అన్నట్టు మూవీకి బజ్ కోసం మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు బహుమతిగా ఇస్తామని.. మనీ రెయిన్ ఇన్ థియేటర్స్ అంటూ డబ్బును ప్రేక్షకులపై కురిపిస్తామంటూ ప్రకటించారు. ఇక ఇంటర్వ్యూల్లో సైతం పలు షాకింగ్ కామెంట్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నారు. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వర్జినిటీ గురించి మిత్రా ఓపెన్ గానే కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారాయి.
వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు..?
మీరు వర్జినిటీని ఎప్పుడు కోల్పోయారు అని యాంకర్ ముందుగా శ్రీహాన్ ను ప్రశ్నించారు. అందుకు కాస్త ఆలోచించినా తర్వాత 5,6 సంవత్సరాల క్రితం అంటూ ఓపెన్ అయ్యాడు. అది కూడా ప్రెజెంట్ తన గర్ల్ ఫ్రెండ్ సిరితో కాదని చెప్పేశాడు. అలానే మిత్ర శర్మను కూడా ప్రశ్నించగా.. ఇద్దరు మనుషుల మధ్య అది ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకంతో జరిగే విషయమని.. అది శరీరానికి కాదు మనసుకు సంబంధించిన విషయం అంటూ చెప్పుకొచ్చింది.
మరి యూత్ ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందా.. లేక నిరాశ పరుస్తుందా అనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగక తప్పదు.
-
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
'జబర్దస్త్' యాంకర్ ఛాన్స్ వదులుకున్న నటి ఎవరో తెలుసా? అనసూయ స్థానంలో.. -
టాలీవుడ్ హీరోకు షాక్ .. 'పెళ్లయిన 3 రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది'..! -
Tollywood: డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన నిర్మాత -
ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్.. ఈ సినిమా చూసి ప్రభాస్ ఫిదా..!! -
సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.. 40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి ప్రేమిస్తే ?? -
కుర్ర హీరోలకి ఇచ్చిన వాల్యూ "అల్లు అర్జున్" మంచు హీరోలకి ఇవ్వలేదుగా..? -
దివ్వెల మాధురిపై బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫైర్..











Click it and Unblock the Notifications