పదేళ్ల చిన్నవాడైన క్రికెటర్‌తో డేటింగ్‌: స్టార్ హీరోయిన్ క్లారిటీ!

సినీ లోకానికి, క్రికెట్ ప్రపంచానికి ఎప్పటి నుంచో విడదీయలేని సంబంధం ఉంది. చాలా మంది నటీమణులు క్రికెటర్లను పెళ్లి చేసుకుని స్థిరపడగా.. మరికొందరు తమ ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల కాలంలో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్, నటి మృణాల్ ఠాకూర్ పేర్లు బాగా ప్రచారంలోకి వచ్చాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు రావడంతో.. ఈ విషయంపై మృణాల్ ఠాకూర్ స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అసలు అలాంటి క్యారెక్టర్ ఎందుకు రాశారు?: పెద్ది మూవీపై నటి షాకింగ్ కామెంట్స్
అసలు అలాంటి క్యారెక్టర్ ఎందుకు రాశారు?: పెద్ది మూవీపై నటి షాకింగ్ కామెంట్స్

ఇటీవల హీరోయిన్ మృణాల్ ఠాకూర్, క్రికెటర్ యశస్వి జైస్వాల్ ముంబైలోని ఓ కేఫ్ నుంచి బయటకు వస్తుండగా కనిపించారు. వారు వేర్వేరుగా బయటకు వెళ్లినప్పటికీ.. ఒకే కేఫ్ నుంచి వారు బయటకు వస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వారు డేటింగ్ చేస్తున్నారనే ఊహాగానాలకు దారితీసింది. 34 ఏళ్ల మృణాల్ ఠాకూర్, 24 ఏళ్ల యశస్వి జైస్వాల్ తో ప్రేమలో ఉందంటూ వరుసగా కథనాలు బయటకు రావడంతో ఊహాగానాలు పెరిగిపోయాయి.

Actress Mrunal Thakur Clarifies Dating Rumors With Cricketer Yashasvi Jaiswal Full Details Here

నెట్టింట వైరలవ్తుతున్న మృణాల్ కామెంట్
ఈ రూమర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మృణాల్ ఠాకూర్ ఓ కామెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో.. "బ్రో.. ప్రశాంతంగా ఉండు.. ఇంత చదువుకున్నా కూడా, మీరంతా ఇలాంటి పుకార్లను ఎలా నమ్ముతున్నారు? ఈ దేశంలో ఏం జరగడం లేదు? జెన్ జెడ్ నుండి ఏదైనా నేర్చుకుని, సరైన విషయాలపై వీడియోలు చేయండి. మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి." అని మృణాల్ గట్టిగానే క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చాయి.

'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ వచ్చేసింది.. సూర్య ఖాతాలో మరో హిట్టు..!
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ వచ్చేసింది.. సూర్య ఖాతాలో మరో హిట్టు..!

అయితే మృణాల్ చేసినట్లు చెబుతున్న ఆ కామెంట్ వైరల్ వీడియోలో ఇప్పుడు కనిపించడం లేదు. అయినప్పటికీ అది సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. అది నిజంగా చేసిన కామెంటా లేక స్క్రీన్ షాట్లను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారా అనే దానిపై పూర్తి స్పష్టత లేదు. మృణాల్ ఠాకూర్, క్రికెటర్ యశస్వి జైస్వాల్ మధ్య 9-10 ఏళ్ల వయస్సు తేడా ఉందని గమనించాలి. మృణాల్ ఠాకూర్ వయస్సు 34 ఏళ్లు కాగా,.. యశస్వి జైస్వాల్ వయస్సు 24 ఏళ్లు. మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే.. గతంలో ఆమెకు ప్రముఖ నటుడు ధనుష్‌తో సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వారి పెళ్లి గురించి కూడా చాలా ప్రచారం జరిగింది. అయితే ఆమె సన్నిహితులు ఈ వార్తలను ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+