ఆ విషయంలో సంతృప్తి చెందాకే.. పెళ్లి, పిల్లలు అంటున్న స్టార్ హీరోయిన్ !
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది "మృణాళ్ ఠాకూర్". తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా 'సీతారామం' తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ - మృణాల్ జోడికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో 'హాయ్ నాన్న' మూవీతో ఆడియన్స్ కి మరింత చేరువైంది. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన 'ఫ్యామిలీ స్టార్' చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది.
ప్రస్తుతం అడివి శేష్ సరసన 'డెకాయిట్' అనే యాక్షన్ డ్రామాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటూ ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటుంది. అలానే తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో మృణాళ్ తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పెళ్లి, పిల్లలు కావాలి.. కానీ ఆ తర్వాతే !
మృణాల్ మాట్లాడుతూ.. నాకు పెళ్లి చేసుకోవాలని.. తల్లిగా మారాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. భవిష్యత్తులో భర్త, పిల్లలతో సంతోషకరమైన జీవితం గడపాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే ప్రతి విషయానికి సరైన సమయం ఉంటుందని నమ్ముతున్నానని తెలిపారు.
ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని.. నటిగా ఇంకా నేర్చుకోవాలని వెల్లడించింది. కెరీర్‌లో ఆ స్థాయికి చేరిన తర్వాతే తృప్తి పొందుతానని.. అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని అన్నారు. అంతే కాకుండా తనకు వుమన్-సెంట్రిక్ సినిమాలు చేయాలన్న కోరిక ఉందని.. భవిష్యత్‌లో అలాంటి కథలు వింటానని వెల్లడించింది.

మరోవైపు మృణాల్ తన గ్లామర్, నటనతో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ సరసన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమాలో నటిస్తుంది. అలానే పలువురు దర్శకులు ఆమెతో పాన్-ఇండియా ప్రాజెక్టులకు సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications