హీరోలు, క్రికెటర్లు.. ఆమె చుట్టూ ఎందుకింత డేటింగ్ రచ్చ?

బుల్లితెరపై నటిగా తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించి..అద్భుతమైన యాక్టింగ్‌తో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. మరోవైపు తన వ్యక్తిగత జీవితం, డేటింగ్ రూమర్లతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కేవలం సినీ నటులతోనే కాకుండా పలువురు క్రికెటర్లతో కూడా ఆమె పేరు ముడిపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Toxic First Review: టాక్సిక్ మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?
Toxic First Review: టాక్సిక్ మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?

యశస్వి జైస్వాల్‌తో డేటింగ్ పుకార్లు
ఇటీవల కాలంలో టీమిండియా యువ సెన్సేషన్ యశస్వి జైస్వాల్, మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఒకే కేఫ్ నుంచి ఇద్దరూ వేర్వేరు సమయాల్లో బయటకు రావడం ఈ పుకార్లకు బలం చేకూర్చింది. ఆ వీడియోలో వారిద్దరూ కలిసి కనిపించకపోయినప్పటికీ.. నెట్టింట పుకార్లు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ.. అవన్నీ కేవలం పుకార్లేనని స్పష్టం చేసింది.

Actress Mrunal Thakur Dating Rumors Truth Behind Her Links with Cricketers and Actors Full Details

ధనుష్, శ్రేయస్ అయ్యర్‌లతో పుకార్లు
తమిళ సూపర్ స్టార్ ధనుష్‌తో కూడా మృణాల్ ఠాకూర్ పేరు జోరుగా వినిపించింది. 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్ ఈవెంట్లో వీరిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకున్న వీడియో వైరల్ కావడంతో.. వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే వీటిని మృణాల్ పూర్తిగా ఖండించింది. అలాగే టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ను మృణాల్ ఠాకూర్ రహస్యంగా డేట్ చేస్తోందంటూ ప్రచారం కాగా.. అవి కూడా ఆధారాల్లేని రూమర్లుగానే మిగిలిపోయాయి.

Viral Video: మత్తులో డ్యాన్స్ చేస్తూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
Viral Video: మత్తులో డ్యాన్స్ చేస్తూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!

ర్యాపర్ బాద్‌షాతో డేటింగ్ రూమర్స్
మృణాల్ ఠాకూర్ పేరు ర్యాపర్ బాద్‌షాతో కూడా ముడిపడింది. శిల్పా శెట్టి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల నుంచి బయటకు వస్తున్న సమయంలో వీరిద్దరూ చేయి చేయి పట్టుకుని నడుస్తున్న వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేసింది. ఆ సమయం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగగా.. తాము కేవలం మంచి స్నేహితులమని, తమ మధ్య అలాంటిదేమీ లేదని బాద్ షా క్లారిటీ ఇచ్చారు.

గతంలో మృణాల్ ఠాకూర్ సీరియస్ రిలేషన్‌షిప్
తన కెరీర్ ప్రారంభంలో మృణాల్ ఠాకూర్ రైటర్ శరద్చంద్ర త్రిపాఠితో సీరియస్ రిలేషన్‌షిప్ లో ఉండేది. వీరిద్దరూ జంటగా 'నాచ్ బలియే 7'అనే ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు. కానీ వీరిద్దరు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరి బంధానికి స్వస్తి పలికి.. వేర్వేరు దారులను ఎంచుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా ఇండస్ట్రీలో క్రేజ్ ను బట్టి రూమర్లు రావడం సర్వసాధారణమైపోయింది. ఈ పుకార్లను మృణాల్ చాలా చాకచక్యంగా ఖండిస్తూ వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+