ధనుష్‌తో డేటింగ్ గురించి మృణాల్ ఠాకూర్ ఓపెన్..!
తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి "మృణాల్ ఠాకూర్". బాలీవుడ్‌లో విజయవంతమైన కెరీర్‌ను కొనసాగిస్తూనే... టాలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె మొదటి సినిమా 'సీతారామం' బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ ఫుల్ క్రేజ్ వచ్చింది. దుల్కర్ సల్మాన్‌తో ఆమె జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో చేసిన 'హాయ్ నాన్న' సినిమా కూడా మంచి విజయాన్ని సాధించగా.. విజయ్ దేవరకొండతో చేసిన 'ఫ్యామిలీ స్టార్' చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
ప్రస్తుతం మృణాల్ బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పాటు, తెలుగులో అడివి శేష్‌తో 'డెకాయిట్' అనే యాక్షన్ డ్రామాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె యాక్షన్ సీక్వెన్సెస్‌లో కూడా తన ప్రతిభను చూపించనుంది.

ధనుష్‌తో రిలేషన్..
గత కొన్ని నెలలుగా, మృణాల్ ఠాకూర్ తమిళ స్టార్ హీరో ధనుష్‌తో రిలేషన్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పలు పబ్లిక్ ఈవెంట్స్‌లో వారిద్దరూ కలసి కనిపించడం, ప్రత్యేకించి ఫ్రెండ్లీ బాండింగ్‌లో ఉండటం ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చింది.
ముఖ్యంగా, ఇటీవల జరిగిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్‌కు ధనుష్ హాజరుకావడంతో ఈ పుకార్లు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి. అంతకుముందు, ధనుష్ నటిస్తున్న 'తేరే ఇష్క్ మే' సినిమా ర్యాప్-అప్ పార్టీకి కూడా మృణాల్ హాజరయ్యారు. అక్కడ వారిద్దరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలానే మృణాల్ సైతం ధనుష్ సోదరీమణులను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చాయి.
ధనుష్ వ్యక్తిగత జీవితం..
2022లో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో తన 18 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాంతో వీరు డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో సైతం చర్చ నడిచింది.

మృణాల్ క్లారిఫికేషన్..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన మృణాల్, "ధనుష్ నాకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే. మా మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు. ఈ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవి" అని స్పష్టంచేశారు. ఇంకా, 'సన్ ఆఫ్ సర్దార్ 2' కార్యక్రమానికి ధనుష్ రావడం అజయ్ దేవగణ్ ఆహ్వానం మేరకేనని, దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. చూడాలి మరి ఈ అమ్మడు ఇచ్చిన క్లారిటీతో అయిన వీరి రిలేషన్ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో అని.
-
సమంత "వావ్" వీడియో వైరల్..! -
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications