సీతా నువ్వేనా..? ఏంటి ఈ చండాలం
మృణాల్ ఠాకుర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'సీతారామం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'సీతారామం' సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందం అభినయంతో కట్టిపడేసింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది.
మృణాల్ ఠాకూర్.. తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి'హాయ్ నాన్న' అనే సినిమా చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ 'ఫ్యామిలి స్టార్' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. 'హాయ్ నాన్న' సినిమా సైతం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. అయినప్పటికీ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇక ఇదే సమయంలో 'సూపర్ 30', 'జెర్సీ' వంటి హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.ఇక తెలుగుతో పాటు, బాలీవుడ్ సినిమాల్లో కూడా వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మృణాల్ ఠాకుర్ ఎప్పటికప్పుడు సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా తన వ్యక్తిగత అకౌంట్‌లో పోస్ట్ చేస్తుంటారు.
తాజాగా మృణాల్ ఠాకుర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైట్ కలర్ డిజైన్‌తో కూడిన స్కర్ట్‌తో దర్శనం ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. అందాలను ఆరబోయడంతో పాటు, నడుము క్రింద భాగం కనింపిచేలా ఇచ్చిన ఫోజులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సీతారామం సినిమాలో పద్దతిగా కనిపించిన మృణాల్ ఠాకుర్ ఇలా గ్లామర్ ఒలకబోయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మృణాల్ ఠాకుర్ గ్లామర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications