నయనతార ఆస్తుల విలువ తెలుసా?

దక్షిణ భారతదేశంలో అత్యంత ఖరీదైన హీరోయిన్ ఎవరయ్యా.. అంటే నయనతార అని చెప్పొచ్చు. 2003లో వచ్చిన మళయాళ చిత్రం మనసిన కాడే తో తన కెరీర్ ను ప్రారంభించింది. 20 సంవత్సరాలకు పైబడి హీరోయిన్ గా తన సుదీర్ఘ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా జవాన్ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయారు. ఆ సినిమాలో నటించినందుకు రూ.12 నుంచి రూ.15 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. దక్షిణాదిలో ఏ హీరోయిన్ తీసుకోనటువంటి రెమ్యునరేషన్ ను ఆమె తీసుకుంటున్నారు.

జవాన్ తర్వాత బాలీవుడ్ చిత్రంలో నటించేందుకైనా లేదంటే తమిళంలో నటించేందుకైనా ఆమె రూ.15 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. సినిమా సినిమాకు తన పారితోషికాన్ని పెంచుకుంటూ వస్తున్న నయనతార ప్రస్తుత ఆస్తుల విలవు రూ.183 కోట్లని ఒక సంస్థ అంచనా వేసింది. ఒక్కో వాణిజ్య ప్రకటన చేసినందుకు రూ.4 నుంచి రూ.7 కోట్లు తీసుకుంటుంది. ఆమె ఒక్క సినిమా నటే కాదు.. వ్యాపారవేత్త కూడా. తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి 'రౌడీ పిక్చర్స్ బ్యానర్' అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. గతేడాది '9 స్కిన్' పేరుతో చర్మ సంరక్షణ సంస్థను కూడా ప్రారంభించారు.

actress nayanthara property value

చెన్నైలో రూ.100 కోట్ల విలువ చేసే విలాసవంతమైన రాజభవనాన్ని నిర్మించుకుంది. తనకున్న నాలుగు బంగళాల్లో ఇది కూడా ఒకటి. తమిళనాడు, కేరళ, హైదరాబాద్, ముంబయిలో నయనతారకు ఆస్తులున్నాయి. రూ.50కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ నయన సొంతం. సొంతంగా జెట్ కలిగివున్నవారిలో నయన కూడా ఒకరు. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసేందుకు ఆమె దీన్ని ఉపయోగిస్తుంటారు. జెట్ కాకుండా అనేక ఖరీదైన వాహనాలు ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, మెర్సిడెస్ జిఎల్‌ఎస్ 350డి వంటి కోట్ల రూపాయల విలువైన కార్లు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+