మన ప్రయాణం మరింత లోతుగా కనెక్ట్ కావాలి..అభిషేక్ బచ్చన్ ప్రియురాలు సంచలనం
గత కొద్దిరోజులుగా ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత జీవితం గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఐశ్వర్యరాయ్ తన భర్త,బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే.
తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఓ హీరోయిన్ కారణంగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.అభిషేక్ బచ్చన్ లైఫ్‌లోకి మరో మహిళ రావడం వల్లే వీరి మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. 'దస్వి' సినిమాలో నటి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్ క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 'దస్వి' 2022లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. అప్పటి నుంచి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్ రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం బాలీవుడ్‌లో జరుగుతోంది.

వీరిద్దరూ రిలేషన్‌షిప్ పెట్టుకున్నారని తెలిసి ఐశ్వర్య గొడవ పెట్టుకుందని అంటున్నారు. ఆ తర్వాత వీరి వైవాహిక బంధంలో సమస్యలు మరింత తీవ్రమయ్యాయని తెలుస్తోంది. అయితే అభిషేక్‌తో తనుకున్న బంధాన్ని మాత్రం నిమ్రత్ కౌర్ బయటపెట్టడం లేదు. అలా అని వస్తోన్న వార్తలను సైతం ఈ భామ ఖండించకపోవడంతో , అభిషేక్‌తో రిలేషన్ నిజమే అని అంతా భావిస్తున్నారు. నిమ్రత్ కౌర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.
అందులో ఆమెకు చాలా క్లోజ్ ఫ్రెండ్ గురించి మాట్లాడింది. వీడియోలో నిమ్రత్ కౌర్ నేలపై కూర్చుని ట్రెండింగ్ డైలాగ్‌ను పెదవి సింక్ చేస్తూ కనిపించింది. 'స్నేహం చాలా బలంగా ఉండాలి.. దానిని చూడగానే ప్రజలు అసూయపడతారు'. 'కేసీ (కరమ్ చంద్)తో నా స్నేహం ఇలా ఉంది. మీ BFFని ట్యాగ్ చేయండి. దీనితో పాటు ఫ్రెండ్‌షిప్, బిఎఫ్‌ఎఫ్ గోల్స్, సండే టైంపాస్, వీకెండ్ వైబ్స్, పక్కదోస్త్, ట్రెండింగ్ రీల్స్ అనే హ్యాష్ ట్యాగ్‌లను తన క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. 'మన ప్రయాణం జీవితంలో మరింత లోతుగా దానితో తక్కువ కనెక్ట్ అవ్వడం' అని చదువుతుంది. అయితే ఈ వీడియో ఎవరి కోసం చేసిందో మాత్రం ఈ భామ వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications