ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వింతజీవిలా చూశారు.. హేళన చేశారంటూ హీరోయిన్ ఎమోషనల్ !
నిత్యామీనన్.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఈమె నేచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, సన్నాఫ్ సత్యమూర్తి, గీతా గోవిందం, భీమ్లా నాయక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత నుంచి తెలుగులో సినిమాలు తగ్గించిన ఈ భామ.. వేరే భాషల్లో వరుసగా నటిస్తూ బిజీగా ఉంది.
అయితే చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని పలువురు నటీనటులు ఓపెన్ గానే స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరియర్ స్టార్టింగ్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి నిత్యా మీనన్ ఓపెన్ అయ్యింది. బాడీ షేమింగ్ ఎదుర్కొన్న వారిలో తాను కూడా ఒకదాన్ని అంటూ ఎమోషనల్ అయ్యింది.

నిత్యామీనన్ మాట్లాడుతూ.. తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తల్లో తనను చాలామంది వింత జీవిలా చూసేవారని వాపోయింది. తన జుట్టును చూసి అందరూ వింతగా చూసేవారని.. స్కూల్, కాలేజీ చదివేటప్పుడు కూడా తన జుట్టు తనకు పెద్ద సమస్యగా ఉండేదని చెప్పింది. అప్పట్లో రింగులు రింగులుగా తిరిగిన తన జుట్టును చూసి అందరూ అలా చూసేవారంటూ చెప్పుకొచ్చింది.
ఇక సినిమాల్లోకి వచ్చాక కూడా తన రింగుల జుట్టును చూసి హేళన చేశారంటూ నిత్యామీనన్ తెలిపింది. అంతే కాకుండా మీరు చాలా పొట్టిగా, లావుగా ఉన్నారు అని కూడా అన్నారని వెల్లడించింది. కనుబొమ్మలు పెద్దవిగా ఉన్నాయని.. కూడా కామెంట్స్ చేశారని ఎమోషనల్ అయ్యింది. కానీ ఆ మాటలే తనను కెరీర్ లో మరింత ముందుకు రాణించగలిగేలా మార్చుకున్నానని అన్నారు. ఇప్పుడు తన జుట్టు అంటే చాలామందికి ఇష్టమని అంటోంది ఈ భామ.
మరోవైపు నిత్యామీనన్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తుంది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ వస్తుంది. అలాగే కొద్ది రోజుల ముందు వరకు తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ప్రసారమయిన తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో జడ్జిగా చేసింది.
-
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
మరో కొత్త కాన్సెప్ట్..? గ్యాప్ ఇవ్వు అన్న కాస్తా..! -
నా కథను మానభంగం చేసేశారు..! -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
విజయ్ దేవరకొండ - రష్మికల్లో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? -
ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్‌కు ‘శ్రీరామరక్ష’












Click it and Unblock the Notifications