సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్ షేర్ చేసిన ప్రముఖ హీరోయిన్.. ఎందుకంటే ?

ప్రముఖ నటి పాయల్ రాజ్ పుత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అజయ్ భూపతి దర్శకత్వంలో.. కార్తికేయ హీరోగా వచ్చిన "ఆర్ఎక్స్ 100" సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమాలో తన నటనకి ప్రేక్షకుల నుంచే కాకుండా ప్రముఖుల దగ్గర నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చినా.. ఈమెకు సరైన హిట్ దక్కలేదనే చెప్పాలి.

రవితేజ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించినా కూడా పాయల్ సరైన సక్సెస్ దక్కించుకోలేకపోయింది. గత ఏడాది మళ్లీ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆమె నటించిన 'మంగళవారం' మూవీతో మళ్లీ సాలిడ్ హాయి అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత పాయల్ నటనకు ప్రశంసలు వచ్చినా.. ఆఫర్లు మాత్రం ఆశించినంతగా రాలేదు. ఇక రీసెంట్ గానే మంగళవారం సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఆ చిత్రంలో పాయల్ కనిపించే ఛాన్స్ లేదని టాక్ నడుస్తోంది.

actress-payal-rajput-shared-phone-number-on-social-media

ఇక సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టిక్ గా ఉంటుంది ఈ భామ. రీసెంట్ గానే నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. అది కాస్తా ఫుల్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో ఏకంగా ఫోన్ నెంబర్ ని షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆ నెంబర్ కి తెగ ఫోన్లు చేసేస్తున్నారు నెటిజన్లు.

ఇంతకీ ఫోన్ నెంబర్ షేర్ చేయడానికి కారణం ఏంటంటే.. పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో ఓ పెట్ ఉంటుందని.. ఇప్పుడు దానికి ఇంకో ఐదు పిల్లలు పుట్టాయని పోస్ట్ చేసింది. వీటన్నంటికి సపరేట్‌గా ఓ షెల్టర్‌ చూస్తున్నానని.. పెట్స్ కోసం చూస్తున్నవారు .. పెట్స్ కి మంచి స్పోర్ట్ ఇస్తూ షెల్టర్ ఇవ్వగలిగే వారు తనని సంప్రదించాలని ఆ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఫోన్ నంబర్ కూడా షేర్ చేసినట్టు ఆమె టీం వివరించారు.

actress-payal-rajput-shared-phone-number-on-social-media

మరోవైపు పాయల్ రాజ్‌పుత్ కెరీర్ గురించి సినీవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆర్ఎక్స్ 100 తర్వాత చేసిన సినిమాల్లో గళం షో కి పరిమితం అవ్వడం.. చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం ఈ భామ కెరీస్ కి మైనస్ అయ్యాయని.. కెరీర్ ముగిసే దశకు వచ్చిన తరుణంలో మంగళవారం సినిమతి కమ్ బ్యాక్ ఇచ్చిందని.. అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ.. మళ్లీ పాయల్‌కు ఎప్పుడు బ్రేక్ వస్తుందో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+