జిమ్‌లో రెచ్చిపోయిన ప్రగతి..చీరలో కత్తిలాంటి కసరత్తులు
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేర్లలో నటి ప్రగతి కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిమంచి గుర్తింపు తెచ్చుకుందామె. ముఖ్యంగా హీరో,హీరోయిన్లకు అమ్మగా పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే సినిమాల కంటే సోషల్ మీడియాలో ద్వారానే ఎక్కువే క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల ప్రగతి రెండో పెళ్లి గురించి మీడియలో అనేక కథనాలు వెలువడిన సంగతి అందరికి తెలిసిందే.
ఓ ప్రముఖ దర్శకుడుని ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి. రెండో పెళ్లి వార్తలపై ప్రగతి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విలువులతో కూడిన జర్నలిజం చేయాలంటూ మీడియాకు ఆమె చురకలు అంటించారు. ఒకవేళ రెండో పెళ్లి చేసుకుంటే కచ్చింతంగా మీకు చెప్పే చేసుకుంటానని ఈ సీనియర్ నటి చెప్పుకొచ్చారు.

ఇక ప్రగతి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికి తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు తన సినిమాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా పోస్టు చేస్తుంటుంది. ముఖ్యంగా తన హాట్ ఫొటోలతో పాటు, జిమ్‌లో తాను కష్టపడుతున్నా వీడియోలను అభిమానుల కోసం షేర్ చేస్తోంది. గతంలో స్పోర్ట్స్ డ్రెస్‌లో జిమ్ చేస్తూ కనిపించిన ప్రగతి.. తాజాగా చీరలో జిమ్ చేస్తూ కనిపించి అందరికి షాకిచ్చింది.
ఈ వీడియోలో ఏకంగా 90 కిలోల బరువులు ఎత్తి నెటిజన్లు షాకిచ్చింది. అది కూడా చీరలో ఇంత బరువు ఎత్తడం మామూలు విషయం కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి చీరలో ఆంటీ జిమ్ చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే అంటూ స్పందిస్తున్నారు. ప్రస్తుతం ప్రగతి చీరలో చేసిన జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications