కొత్త హీరోయిన్స్ ఆ హీరోతో మంచం ఎక్కాల్సిందే.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు.

పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

Actress Preetika Rao accuses Harshad Arora of casting couch

కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. తాజాగా హీరోయిన్ ఓ హీరో బండారాన్ని బయటపెట్టింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ప్రతీకా రావు. ఈ అమ్మడు తెలుగులో వరుణ్ సందేశ్ తో కలిసి లవర్ బాయ్ అనే సినిమా చేసింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, ఈ భామ తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ప్రతీకా రావు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఓ నెటిజన్ ప్రతీకా రావుకు సంబంధించిన వీడియో ఒక దాన్ని షేర్ చేయగా, దాన్ని డిలీట్ చేయాలని ఆమె కోరింది. దానికి ఆ నెటిజన్ రొమాంటిక్ సీన్స్ చేసినప్పుడు లేదు కానీ, చూస్తే వచ్చిందా అంటూ సమాధానం ఇచ్చాడు. దీనిపై ప్రతీకా రావు మాట్లాడుతూ..కొన్ని సీన్స్ అప్పటికప్పుడు షూట్ చేస్తారు. ముందుగా అనుకోకుండా స్పాట్‌లో సీన్స్ మారుస్తారు. ఆ సీన్ కూడా అలా చేసిందే అని ఆమె వివరించింది. అసలే ఆ హీరో కొత్త హీరోయిన్స్‌ను వదిలిపెట్టడు. కొత్త హీరోయిన్స్‌ను తన బెడ్ మీదకు లాగేవరకు వదిలిపెట్టడని చెప్పి షాకిచ్చింది.

ఈ వ్యాఖ్యలపై హర్షద్ అరోరా స్పందిస్తూ, ప్రీతికా ఇలా ఎందుకు మాట్లాడిందో తనకు తెలియదని, ఇది పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చని అన్నారు. సీరియల్ ముగిసి దాదాపు 12 ఏళ్లు అవుతున్నందున ఆమె వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. షూటింగ్ సమయంలో తమ మధ్య సఖ్యత లేదని, కానీ తామిద్దరూ ఎప్పుడూ ప్రొఫెషనల్‌గా ఉన్నామని హర్షద్ తెలిపారు. ప్రీతికా వ్యక్తిగత జీవితం గురించి తాను ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదని, ఆమె చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు బాధించాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+