"వారణాసి" మూవీ నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్... ఫుల్ ట్రెండింగ్ !!

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు.. ఆధ్యాత్మిక అంశాలతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.

పవన్ - సింగీతం కాంబోలో మూవీ.. ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆగిపోవడానికి కారణం ఇదే ???
పవన్ - సింగీతం కాంబోలో మూవీ.. ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆగిపోవడానికి కారణం ఇదే ???

రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వగా.. అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేశాయి. కాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 44వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చింది మూవీ యూనిట్.

actress-priyanka-chopra-photo-released-by-varanasi-movie-team-on-celebrating-her-birthday-and-got-vi

ఈ మూవీలో నుంచి ప్రియాంక ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. కాగా ఈ స్టార్ బ్యూటీ 'మందాకిని' అనే పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ ఫొటోలలో ప్రియాంక పూర్తి నలుపు రంగు దుస్తులలో, ఉంగరాల జుట్టుతో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. గతంలో ఆమె ఎల్లో శారీలో ఉన్న పిక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

ఇక ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హాలీవుడ్ లో సైతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది. 2000లో మిస్ వరల్డ్ కిరీటం ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హిందీలో "అందాజ్", "డాన్", "క్రిష్", "బర్ఫీ", "ఫ్యాషన్", "బాజీరావ్ మస్తానీ" వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా "ఫ్యాషన్" చిత్రంతో ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోగా.. దేశవ్యాప్తంగా ఆమెకు విశేష గుర్తింపు తీసుకొచ్చింది.

హాలీవుడ్ లో అమెరికన్ టీవీ సిరీస్ "క్వాంటికో"లో ప్రధాన పాత్ర పోషించి గుర్తింపు పొందారు. ఆ తర్వాత "బేవాచ్", "ఇజ్ నిట్ ఇట్ రొమాంటిక్", "టెక్స్ట్ ఫర్ యూ", "సిటాడెల్" వంటి ప్రాజెక్టులతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అలానే తెలుగులో ఇప్పటివరకు నటించకపోయినా.. రామ్ చరణ్‌తో కలిసి బాలీవుడ్ చిత్రం "జంజీర్"లో నటించారు. ఇది తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+