అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. గ్లామర్ గేట్లు ఎత్తేస్తున్న బ్యూటీ !
అక్కడేమో సాంప్రదాయని సుప్పిని అనేలా ఉండే.. ఇక్కడేమో గ్లామర్ గేట్లు ఎత్తేయడం చూస్తుంటే ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకులు సైతం ఏమైంది రా అంటూ షాక్ అవుతున్నారు. సీరియల్లో పద్దతిగా లంగావోణిలో ఎంతో అందంగా కనిపించి.. సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది ఓ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఏమంటూ ఓ రియాల్టీ షో లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి నెట్టింట గ్లామర్ రచ్చ చేస్తుంది. దాంతో అక్కడ అలా.. ఇక్కడ ఇలా ఎందుకు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నటి ఎవరు అని అనుకుంటున్నారా ???
ప్రముఖ నటి ప్రియాంక జైన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. 1998లో జూలై 2న జన్మించింది. జైన్ కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో బుల్లితెరలోకి వచ్చింది. కన్నడలో పలు సీరియల్స్ చేసిన ప్రియాంక జైన్.. ఆ తర్వాత తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.

2018లో 'చెల్తే చల్తే' అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మౌన రాగం, జానకి కలగనలేదు సీరియల్స్ తో ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. ఇక అప్పటి నుంచి సీరియల్స్ తగ్గించిన ఈ భామ.. యూట్యూబ్ వీడియో లతో, సోషల్ మీడియా పోస్టులతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.
ప్రస్తుతం బుల్లితెర నటుడు శివకుమార్ తో రిలేషన్ లో ఉన్న ఈమె.. అతనితో కలిసి ప్రాంక్ వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం కలిసే ఉంటున్న ఈ జంట.. యూట్యూబ్ వీడియో లతో పాటు పలు కార్యక్రమాల్లో సైతం పాల్గొంటూ ఉంటారు. అయితే బిగ్ బాస్ కి వెళ్లక ముందు అచ్చ తెలుగు అమ్మాయిల పద్దతిగా ఉండే ప్రియాంక.. బిగ్ బాస్ వెళ్లొచ్చాక రూట్ మార్చింది. పొట్టి డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తూ, పిచ్చి పిచ్చి ప్రాంక్ వీడియోలతో కాలం గడిపేస్తుంది.












Click it and Unblock the Notifications