'కల్కి' వాళ్లకే బాగా నచ్చుతుంది ..హీరోయిన్ రాశి షాకింగ్ కామెంట్స్
బాక్సాఫీస్ వద్ద కల్కి దూసుకుపోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కిలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రల్లో కనిపించారు. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు.
పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వీఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెకకెక్కిన ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. ఈక్రమంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కుమ్మేసింది.

రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ స్టామినాను మరోసారి ఈ సినిమా నిరూపించింది. పలువురు సినీ ప్రముఖులు సైతం సినిమాపై తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్ రాశి తాజాగా కల్కి సినిమాపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా పాపతో కలిసి కల్కి సినిమాను 3Dలో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేశానని ఆమె తెలిపింది. సినిమాలో ప్రభాస్ అద్భుతంగా నటించాడని.. భైరవ పాత్ర ప్రభాస్ తప్ప ఇంకెవరూ కూడా చేయలేరని ఆమె కితాబిచ్చారు.
నాగ్ అశ్విన్ ఈ సినిమాకు అంత టైమ్ ఎందుకు తీసుకున్నాడనేది ఇప్పుడు అర్ధం అవుతోందని..క్లైమాక్స్ లో అయితే ఎవరూ ఊహించలేని ట్విస్ట్ ఇచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడని రాశి చెప్పుకొచ్చారు.అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా ముఖ్యమైనది. కమల్ హాసన్ కూడా బాగా నటించాడు ఒక రకంగా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ ఈ మూవీకి బ్యాక్ బోన్ , కమల్ హాసన్ గెటప్ ప్రతీ ఒక్కర్ని ఆకట్టుకుంటుందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమా పెద్దల కంటే పిల్లలకు బాగా నచ్చుతోందని చెప్పి చివర్లో ఆమె షాకిచ్చింది.












Click it and Unblock the Notifications