పూరీ - విజయ్ సేతుపతి మూవీలో బాలయ్య హీరోయిన్..?
టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఉగాది సందర్భంగా ఆ వివరాలను పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న విజయ్ సేతుపతి.. వరుస ఫ్లాప్ లతో ఉన్న పూరీ జగన్నాథ్ మూవీ చేయడం ఏంటని టాలీవుడ్, కోలీవుడ్ లో తీవ్ర చర్చ జరుగుతోంది.
రీసెంట్ గా ఈ విషయంపై నోరు విప్పిన విజయ్ సేతుపతి.. తనకు స్క్రిప్ట్ నచ్చితే ఏ డైరెక్టర్ తో అయినా కలిసి పనిచేస్తానని.. సక్సెస్ తో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. పూరీ చెప్పిన కథ కొత్తగా ఉండటంతోనే ఆయనతో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్నానని చెప్పారు. ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా రాధికా ఆప్టే నటించనున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో రక్తచరిత్ర, లయన్, ధోనీ, లెజెండ్ సినిమాల్లో నటించింది. అలానే బాలీవుడ్ లో సైతం పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. బోల్డ్ సీన్స్ లలో సైతం నటించిన ఈమె.. ప్రస్తుతం నటిగానే కాకుండా దర్శకురాలిగా మారింది. హిందీ-మరాఠీ భాషలలొ "కోట్యా" అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇక ఇప్పటికే ఈ మూవీలో సీనియర్ నటి టబు నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' తర్వాత ఏ తెలుగు సినిమాను ఒప్పుకోని టబు.. ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూరీ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
She’s electric.
— Puri Connects (@PuriConnects) April 10, 2025
She’s explosive .
She’s THE TABU.
Proudly welcoming THE GEM OF INDIAN CINEMA, Actress #Tabu on-board for a ROLE as DYNAMIC as her presence in #PuriSethupathi ❤️🔥
A #PuriJagannadh Film
Starring Makkalselvan @VijaySethuOffl
Produced by Puri Jagannadh,… pic.twitter.com/WGp0kkuZDl
ఉప్పెన, సైరా సినిమాల్లో నటనతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి . ఇక దళపతి విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్ ' సినిమాలో తన విలనిజంతో అందర్నీ ఆకట్టుకున్నాడు. రీసెంట్ గానే మహారాజా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది.
-
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
థాయ్ లాండ్ లో రష్మిక, విజయ్ హనీమూన్.. ఫోటో వైరల్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications