ఆ హీరోయిన్ కాపురంలో చిచ్చు పెట్టిన తమన్నా

హీరోయిన్ తమన్నా పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు.

ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికి తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

actress rambha interesting comments on tamanna

ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.ఇదిలా ఉంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ తమన్నాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రంభ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..సోషల్ మీడియాలో తన భర్తని ఫాలో కావట్లేదట. దానికి కారణం తమన్నా అని చెప్పింది.

రంభ భర్త సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు తనని ఫాలో కావాలని భర్తను రంభ అడిగిరట . కానీ ఆయన తమన్నాని ఫాలో అయ్యారట. దాంతో అలిగిన రంభ అందుకే ఇప్పటికీ భర్తని ఫాలో కావట్లేదని తెలిపింది.తమన్నాని ఫాలో కావొద్దని చెప్పలేదు, నాకు సంతోషమే. కానీ భార్యగా నాకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా అని భర్తను రంభ ప్రశ్నించింది. ప్రస్తుతం తమన్నాపై రంభ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+