సమంతకు గాయాలు: ఆందోళనలో ఫ్యాన్స్
ప్రముఖ సినీ నటి సమంతకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు ఆమె అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. ఓ సినిమా షూటింగ్‌లో ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. సమంత గాయపడినట్లుగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో తమ అభిమాన నటికి ఏమైందో అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
'గాయాలు కాకుండా నేను యాక్షన్ స్టార్ కాగలనా?' అంటూ సమంత సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. మోకాలికి సూదులతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటోను జతచేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఏం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

అయితే, సమంతకు ఆ గాయాలు ఎలా జరిగాయనేది తెలియాల్సి ఉంది. ఎప్పుడు గాయమైంది? ఏ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగిందనే విషయం మాత్రం సమంత వెల్లడించలేదు. కాగా, సమంత ఇటీవల నటించిన సిటాడెల్ హానీ బన్నీ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించగా.. హిందీతోపాటు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
గత కొద్ది కాలం వరకు సమంత సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటంతో ఆమె చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇటీవలే ఆమె కొంత కోలుకోవడంతో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అంతేగాక, ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ అంశంపైనా ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే.
మలయాళ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై హేమకమిటీని వేసినట్లుగానే టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాంటిది వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ పోస్టు పెట్టారు.












Click it and Unblock the Notifications