మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన మల్లు బ్యూటీ "సంయుక్త"..
ప్రముఖ నటి సంయుక్త తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మలయాళం హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. 'పాప్‌కార్న్' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ కేరళ కుట్టి, తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'బింబిసార', 'సార్', 'విరూపాక్ష' వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త, ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా ఉంది. తన అందం, అభినయంతో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే తెలుగులో 'అఖండ-2', 'స్వయంభు' వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను అందుకుంది.

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు పూరీ. ఇక ఇప్పటికే ఈ మూవీలో సీనియర్ నటి టబు, దునియా విజయ్ నటిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఓ భారీ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. గోల్డెన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ.. ఈ చిత్రంలో నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఈ చిత్రానికి 'బెగ్గర్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.
Grace in her stride. Fire in her eyes.
— Puri Connects (@PuriConnects) June 17, 2025
Welcoming the stunning @iamsamyuktha_ on board into the electrifying world of #PuriSethupathi ❤️🔥❤️🔥❤️🔥
A #PuriJagannadh film
Starring Makkalselvan @VijaySethuOffl, #Tabu, and @OfficialViji
Produced by Puri Jagannadh & @Charmmeofficial under… pic.twitter.com/RzlZMBs4DJ
పూరి జగన్నాథ్ గత చిత్రాలు లైగర్, ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని పొందాయి. మరోవైపు విజయ్ సేతుపతి మాత్రం మహారాజా, విడుదల పార్ట్ 2, ఏస్ చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. అందుకే ఈ సినిమా కోసం కాస్త టైం తీసుకుని మరీ పూరీ ఈ కథను రెడీ చేసినట్లు సమాచారం. దాంతో ఈ మూవీతో పూరీ గట్టి కమ్ బ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అంటూ తెలుగు ఆడియన్స్ పోస్టులు పెడుతున్నారు.
ప్రస్తుతం సంయుక్త.. 'అఖండ-2', 'స్వయంభు'తో పాటు శర్వానంద్ తో 'నారీ నారీ నడుము మురారి', బెల్లం కొండ శ్రీనివాస్ తో ఒక చిత్రంలో చేస్తోంది సంయుక్త. అంతే కాకుండా మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న 'రామ్' సినిమాలోనూ నటిస్తోంది. బాలీవుడ్ లో మహారాణి.. దీ క్వీన్ ఆఫ్ క్వీన్స్ సినిమాలోనూ కీ రోల్ పోషిస్తోందీ ఈ భామ.
-
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications