అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటానంటున్న స్టార్ హీరోయిన్...
ప్రముఖ నటి సంయుక్త తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మలయాళం హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. తన అందం, అభినయంతో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. పవన్ - రానా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సరసన బింబిసార కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.
టాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. ఆ మధ్యన కాస్త డల్ అయినా మళ్లీ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు అప్పుడప్పుడు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందని చెప్పడం సంచలనంగా మారింది. అయితే అన్ని పార్టీల్లో కాదు.. క్లోజ్ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నప్పుడేనని ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అలానే తనకు ట్రావెలింగ్ అంటే పిచ్చి అని.. ప్రయాణాల్లో ప్రకృతి సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక విశిష్టత ఉన్న ప్రాంతాలకు వెళ్తుంటానని తెలిపింది. కేరళ స్టయిల్ వంటకాలంటే ప్రాణమని.. సినిమాల్లో కూడా ఆయా ప్రాంతాల ప్రత్యేక వంటకాలు తెలియ చేసే సినిమాలు రావాలని స్పష్టం చేసింది. ఏ విషయం అయినా, బోల్డ్‌గా చెప్పేయడం సంయుక్త అలవాటు. ఈ తరహా లోనే ఇప్పుడు కూడా ఆల్కహాల్ గురించి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు సినిమా పరిశ్రమ లేడీ ఆర్టిస్టులతో ప్రవర్తించినంత మర్యాదగా.. మరే భాషా రంగం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేసింది. కో -ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్‌తోనే తను కూడా పోటీ పడి నటించగలనని.. అవతల ఆర్టిస్టు డమ్మీ అయితే తను కూడా నీరు కారిపోతానని చెప్పింది. సాధారణంగా హీరోయిన్లకు ఇలాంటి అలవాట్లున్నా ఎవరూ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ సంయుక్త మీనన్ మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పడం పట్ల ఆమె ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.
ఇక రీసెంట్ గానే ధనుష్ తో చేసిన బై లింగ్వల్ మూవీ సార్ కూడా సూపర్ హిట్ కాగా, కల్యాణ్ రామ్ తో చేసిన డెవిల్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ స్వయంభు, అఖండ2 చిత్రాల్లో నటిస్తోంది. అలానే శర్వానంద్ తో 'నారీ నారీ నడుము మురారి', బెల్లం కొండ శ్రీనివాస్ తో ఒక చిత్రంలో చేస్తోంది సంయుక్త. అంతే కాకుండా మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న 'రామ్' సినిమాలోనూ నటిస్తోంది. బాలీవుడ్ లో మహారాణి.. దీ క్వీన్ ఆఫ్ క్వీన్స్ సినిమాలోనూ కీ రోల్ పోషిస్తోందీ ఈ భామ.












Click it and Unblock the Notifications