బాలయ్య కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్.. కారణం అదే ?
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నటి సంయుక్తతో కలిసి ఏలూరులో సందడి చేశారు. నగరంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రముఖ నగల దుకాణాన్ని వీరిద్దరూ కలిసి ప్రారంభించారు. ఈ వేడుకను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరవ్వడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ, తన తాజా చిత్రం 'అఖండ 2' గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమా నిర్మాణం పూర్తైందని.. మూవీ చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. అలానే ఈ ఈవెంట్ అనంతరం మరో ఆసక్తి ఘటన చోటు చేసుకోవడం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది.

ఈ జ్యూయలరీ షాప్ ఓపెనింగ్ తర్వాత నటి సంయుక్త మీనన్.. తిరిగి వెళ్లిపోయే ముందు బాలకృష్ణ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. బాలకృష్ణ ఇతరులతో మాట్లాడుతుండగా.. ఆమె వెనుక నుంచి వచ్చి కాళ్లకు మొక్కారు. ఈ అనూహ్య సంఘటనతో బాలకృష్ణ సైతం ఆశ్చర్యపోగా వెంటనే ఆమెను ఆశీర్వదిస్తూ "దీర్ఘాయుష్మాన్ భవ" అని ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన వీడియో స్వకీసల మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు ఫుల్ గా వైరల్ అవుతోంది.
మరోవైపు బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. 'అఖండ' మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25 న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.
Back to Hyderabad ❤️❤️ pic.twitter.com/H4AjkWRqlE
— ᴹᵃʰᵃʳᵃᵃʲ Balayya Yuvasena (@BalayyaUvasena) June 13, 2025
ఇప్పటికే వీరు కలిసి చేసిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోగా.. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అఖండ చిత్రంతో స్పీకర్లు బద్దలు కొట్టిన తమన్.. ఈ మూవీతో కూడా మరోసారి మోత మోగించడం గ్యారంటీ అని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications