అవకాశాల కోసం లొంగిపోవాల్సి వస్తోంది?
తెలుగు సినీ పరిశ్రమలోకి డాలర్ డ్రీమ్స్ సినిమా ద్వారా అడుగు పెట్టింది సత్యకృష్ణన్. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది. హోటల్ తాజ్ కృష్ణలో మొదట ఉద్యోగం చేసేది. తర్వాత పరిశ్రమలోకి అడుగుపెట్టింది. శేఖర్ కమ్ముల సినిమా ఆనంద్ లో కీలకమైన పాత్ర చేసింది. ఆ సినిమాతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డు దక్కించుకుంది. తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంది. మెంటల్ కృష్ణ, ఒక్కడినే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బొమ్మరిల్లు లాంటి సినిమాల్లో మెరిసింది.
తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన దూత వెబ్ సిరీస్ లో నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సత్య కృష్ణన్ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అది ఎక్కడైనా ఉంటుందని, అటువంటి సంఘటన ఎదురైనప్పుడు మహిళలు తమను తాము రక్షించుకుంటే అంతా సవ్యంగానే జరుగుతుందన్నారు. ఎదుటివారు లిమిట్ దాటుతుంటే ధైర్యంగా సమాధానం చెప్పాలన్నారు. ఒకవేళ కమిట్ మెంట్ కు ఒప్పుకోకపోతే పరిశ్రమలో అవకాశాలు ఇవ్వరేమో అన్న భయంతో చాలామంది లొంగిపోతారన్నారు.

అయితే అటువంటి ఉద్దేశం తప్పని, తన కెరీర్ లో ఈ తరహా పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. కాకపోతే అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నవారిని మాత్రం ప్రత్యక్షంగా చూశానని సత్యకృష్ణన్ చెప్పారు. సినిమాలు తప్ప వేరే జీవితం లేదని పరిశ్రమలోకి వచ్చేవారు కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోవడం కొంత కష్టంగానే ఉంటుందని, అయినా ధైర్యంతో అటువంటి సమయంలో తమను తామే రక్షించుకోవాలన్నారు. నటిగా పలు సినిమాలు చేసిన సత్యకృష్ణన్ నిర్మాతగా మారేదిశలో అడుగులు వేస్తోంది. దర్శకత్వం చేయాలనే ఆసక్తి కూడా ఉందని తెలిపింది. ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications