కోహ్లీతో విడాకులు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అయితే ఓ హీరోయిన్ 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. విచిత్రం ఏమిటంటే వెంటనే భర్తకు విడాకులు ఇచ్చిన ఆ హీరోయిన్, మరో పెళ్లి చేసుకుంది. అయితే రెండో భర్తకు కూడా విడాకులిచ్చింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..శ్వేతా తివారీ.
శ్వేతా తివారీ పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది, స్టార్‌ప్లస్ ఛానల్‌లో ప్రసారమైన 'కసౌతీ జిందగీ కే' సీరియల్‌లోని ప్రేరణ శర్మ పాత్ర. తన అద్భుత నటనతో ఈ పాత్రలో జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు.1980 అక్టోబర్ 4న ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన శ్వేతా తివారీ, తన కెరీర్‌ను 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్‌తో ప్రారంభించారు.కానీ, ఆమెకు నిజమైన గుర్తింపు తెచ్చిపెట్టింది 'కసౌతీ జిందగీ కే' సీరియల్. ఈ సీరియల్‌లో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

శ్వేతా తివారీ వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో మలుపులు తిరిగింది. 1998లో రాజా చౌదరిని వివాహం చేసుకున్నారు. వారికి పాలక్ అనే కూతురు ఉంది.అయితే, విభేదాల కారణంగా వీరు 2007లో విడాకులు తీసుకున్నారు. తరువాత అభినవ్ కోహ్లీని వివాహం చేసుకున్నారు. వారికి రెండో సంతానం జన్మించింది. అయితే, ఈ వివాహం కూడా విడాకులతో ముగిసింది.శ్వేతా తివారీ ప్రస్తుతం టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలలో పాల్గొంటూ బిజీగా ఉంది.
తన కూతురు పాలక్ తివారీ కూడా ఇప్పుడు సినిమాల్లో అడుగుపెట్టింది.












Click it and Unblock the Notifications